జస్ట్ ఆస్కింగ్: తిరుపతిలో పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ దొరకవా.?

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో పాల్గొనాల్సి వుంది. కానీ, కరోనా బూచిని చూపిస్తూ, తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ‘నేను ప్రచారం చెయ్యకపోయినా పార్టీ గెలుస్తుంది..’ అనే ధీమాతో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకుంటే, దానికి తప్పు పట్టాల్సిన అవసరమే లేదు.

‘అసలు తిరుపతి ప్రజలకు ప్రత్యేక హోదా, వైఎస్ వివేకా హత్య వంటి అంశాలపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని ముఖ్యమంత్రి భావిస్తే అది ఇంకో లెక్క. కానీ, కరోనా వైరస్‌ని బూచిగా చూపడమేంటి.? వైఎస్ జగన్ వెళితే, కరోనా వ్యాప్తి చెందుతుంది.. అదే వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారాలకు వందలాదిమందిని వెంటేసుకుని వెళితే కరోనా వ్యాప్తి చెందదు.. అంటే ఎలా.? ఈ విషయమై సోషల్ మీడియాలో చాలా సెటైర్లు పేలుతున్నాయి.

‘ఎవరో కరోనా వస్తే ఏమవుతుంది. పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసి, ఇంత బ్లీచింగ్ పౌండర్ చల్లితే పోతుందన్నారు. ఇట్ కమ్స్.. ఇట్ గోస్.. అని కూడా అన్నారు. మరి అంతటి చిన్నదాని కోసం ఎన్నికల బహిరంగ సభ రద్దు చేసుకోవడం ఏంటో? అందరికీ తలా ఓ పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చి, సభా ప్రాంగణంలో బ్లీచింగ్ పౌండర్ చల్లితే కరోనా వస్తదా? అసలే అక్కడ వున్నది అన్న. పులిబిడ్డ. అన్న పేరు చెబితే కరోనా పారిపోతుంది.. ఎక్కడ బాత్రూమ్‌కి తీసుకెళతాడో అని భయపడుతూ. కాదంటారా ప్రజలారా? ఆహా జస్ట్ ఆస్కింగ్?’ అంటూ ఓ రాజకీయ పార్టీకి చెందిన న్యాయవాది ఒకరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఆయన జనసేన నేత. ఇలాంటివి కోకొల్లలుగా సోషల్ మీడియాలో సెటైర్లున్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద.

సరే, రాజకీయాలన్నాక విమర్శలు మామూలేననుకోండి.. అది వేరే సంగతి. కానీ, సీఎం జగన్, తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు చేసుకోవడానికి సంబంధించి జస్టిఫికేషన్ కుదరడంలేదు. పథకాల ప్రచారం కోసం జనాన్ని పోగేసినప్పుడు రాని కరోనా.. ఇప్పుడెలా వస్తుందట.?