ఆథియా పెళ్లి గౌను డిజైనింగ్ కు 10000 గంటలు

నటి అతియా శెట్టి – KL రాహుల్ జనవరి 23న ‘ఖండాలా’ ఫామ్ హౌస్ లో వివాహం చేసుకున్నారని నటి తండ్రి.. స్టార్ హీరో సునీల్ శెట్టి అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి అథియా శెట్టితో భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ పెళ్లి అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా సాగింది. ఈ పెళ్లికి కొద్దిమంది సన్నిహితులు బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు.

కొత్తగా పెళ్లయిన జంట ఇన్ స్టాలో వివాహ వార్తలను షేర్ చేసారు. పెళ్లి వేడుక నుంచి కొన్ని అందమైన ఫోటోలను వీడియోలను కూడా రిలీజ్ చేయగా వైరల్ అయ్యాయి. ”ఈరోజు మా అత్యంత ప్రియమైన వారితో మా ఇంట్లో పెళ్లి చేసుకున్నాం. ఇది మాకు అపారమైన ఆనందాన్ని ఇచ్చింది. కృతజ్ఞతలు.. ప్రేమతో నిండిన హృదయంతో మీ ఆశీర్వాదం కోరుతున్నాము” అని ఆథియా ఎమోషనల్ గా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యానించింది.

నవ వధువు అథియా ఇటీవలే తన పెళ్లిలో అందరి దృష్టిని ఆకర్షించింది. సాంప్రదాయ డిజైనర్ డ్రెస్ లో ఎంతో అందంగా ట్రెడిషనల్ గా కనిపించింది. ఎందుకంటే అతి సున్నితమైన గులాబీ రంగు చికంకారీ లెహంగాను ఎంపిక చేయడంలోనే పెద్ద సక్సెసైంది. ఆథియా భర్త KL రాహుల్ ఎంబ్రాయిడరీ ఐవరీ షేర్వానీలో అందంగా కనిపించాడు. అతియా లెహెంగా తయారీకి ఆకట్టుకునే వెడ్డింగ్ గెటప్ కి ఎంత సమయం పట్టి ఉంటుంది? అంటూ ఇప్పుడు అభిమానుల్లో ఆరాలు మొదలయ్యాయి.

అయితే తాజాగా అందిన వివరాల ప్రకారం.. ఈ లెహంగా కోసం డిజైనర్లు చాలా సమయం వెచ్చించాల్సి వచ్చిందని తెలిసింది. అతియా శెట్టి లవ్లీ పింక్ వెడ్డింగ్ లెహంగా మేకింగ్ చేతితో నేసినది. జర్దోజీ- జాలీ వర్క్ డిజైన్ తో పట్టులో డిజైన్ చేసినది. లెహంగాలో ఒక అందమైన వీల్ .. దుపట్టా ఉన్నాయి. ఇది సిల్క్ ఆర్గాన్జాతో సంక్లిష్టమైన చేతిపనితో తయారు చేసినది. ప్రఖ్యాత వోగ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిజైనర్ అనామిక ఖన్నా అతియా లెహంగా తయారు చేయడానికి 10000 గంటలు పట్టిందని వెల్లడించారు. వివాహ లెహంగా వెనుక వధువు ప్రేరణ చాలా తోడ్పడిందని కూడా ఆమె వెల్లడించింది.

అనామిక ఇంకా మాట్లాడుతూ.. అథియా అభిరుచి చాలా బాగుంది. తను చాలా అందంగా ఉంది. ఆమె తన స్పెషల్ డే కోసం ప్రత్యేకంగా ఏదైనా డిజైనర్ లుక్ ని డెవలప్ చేయాలని కోరింది. అథియా శరీరంలో సున్నితమైన భాగం ప్రతి బిట్ రాయల్ గా కనిపించాలని భావించి చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ లెహంగాను డిజైన్ చేసాం.

అథియా తన పెళ్లి గెటప్ ని బ్లష్ పింక్ ఐషాడో -న్యూడ్ పింక్ పెదాలతో ప్రత్యేకంగా మార్చింది. భారీ చోకర్ నెక్లెస్- మాంగ్ టికా- భారీ చెవిపోగులు- అందమైన చేతులకు బ్యాంగిల్స్ తో గ్లామరస్ గాను కనిపించింది. పార్టెడ్ స్టైల్ లో కొత్తగా కనిపించింది… అంటూ డిజైనర్ అనామిక వాస్తవిక వివరాల్ని అందించారు. ఆథియా పెళ్లి తర్వాత వెంటనే హనీమూన్ ప్లాన్ చేయడం లేదని తెలిసింది. కేఎల్ తదుపరి క్రికెట్ టోర్నమెంటుతో బిజీ అవుతుంటే ఆథియా తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనుంది.