కంగన లా ఫేమస్ అవ్వాలన్నది తాప్సీ ప్లాన్!

బాలీవుడ్ కి వెళ్లిన దగ్గర నుంచి తాప్సీ లో ఛేంజోవర్ చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో ఉన్నంత కాలం కామ్ గోయింగ్ గాళ్ల్ గా వెళ్లిపోయింది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు తప్ప మరో ధ్యాస లేకుండా ముందుకు సాగింది. కానీ హిందీ కెళ్లిన తర్వాత మొత్తం విధానమే మార్చేసింది. ముందుగా తనలో డేరింగ్ నెస్ ని బయట పెట్టింది.

ఏ విషయంపైనైనా కంగన తరహాలో ముక్కు సూటిగా మాట్లాడటం అలవర్చుకుంది. వివాదాల తలెత్తితే తనదైన శైలిలో స్పందించడం నేర్చుకుంది. ఎవరైనా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కౌంటర్లు వేడయం ప్రారంభించింది. ఇలా ఒకటేంటి? చాలా విషయాల్లో మార్పులు తీసుకొచ్చింది తాప్సీ. ఇలా ప్రతీ విషయంలో కంగనకు మ్యాచ్ అయింది.

ఇటీవలే ఓ స్టార్ హీరోయిన్ సైతం తాప్సీని కంగనలా మరో ఫైర్ బ్రాండ్ దిగిందంటూ ఆకాశానికి ఎత్తేసింది. కొన్ని విషయాల్లో తనకి -తాప్సీ కి పడకపోయినా తనలో డేరింగ్ నెస్ కి ఫిదా అయ్యానంటూ సదరు హీరోయిన్ రివీల్ చేసింది. మరి కంగన లా తాప్సీ నటిగా కూడా అంతే కమిట్ మెంట్ తో కెరీర్ ని ప్లాన్ చేసుకుంటుందా? సోలోగానే ఇమేజ్ ని రెట్టింపు చేసుకునే ప్లాన్ లోఉందా? అంటే అవుననే తెలుస్తోంది.

తాప్సీ నటిగా కొనసాగుతూనే ఇటీవల నిర్మాతగాను పరిచయమైన సంగతి తెలిసిందే. తన నిర్మాణ సంస్థలో లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేసి హీరోయిన్లు..హీరోలకి ఏమాత్రం తీసిపోరని చాటి చెప్పాలన్నది అమ్మడి ప్లాన్ గా వైరల్ అయింది. దీనికి తగ్గట్టు సదరు బ్యానర్లో సమంతతో ఓ లేడీ ఓరియేంటెడ్ సినిమా నిర్మిస్తున్నట్లు ప్రచారం సాగింది.

ఇక హీరోయిన్ గా కంగనలా వెలిగిపోవాలని తాప్సీ ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా విదేశీ సినిమా రీమేక్ ల్లోనటిస్తోంది. ఆ మధ్య ‘బద్లా’ అనే ఓ సినిమాలో నటించింది. ఇది ఓ స్పానిష్ సినిమాకి రీమేక్. తాజాగా ‘బ్లర్’ అనే సినిమా చేస్తుంది.

అక్కా చెల్లెళ్ల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రమిది. ఇది కూడా మరో స్పానిష్ సినిమా రీమేక్ అని తెలుస్తోంది. సొంత కంటెంట్ కంటే విదేశీ హిట్ సినిమాల్ని తీసుకుంటే సక్సెస్ ఈజీ అవుతోంది అన్న కోణంలో తాప్సీ ఇలా ముందుకు సాగుతోంది. బ్యాక్ టూ బ్యాక్ లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతోనే మార్కెట్ ని బిల్డ్ చేసుకోవాలన్నది తాప్సీ మెయిన్ ప్లాన్ గా తెలుస్తోంది.