చివరకు వాటిని కూడా చేసేందుకు ఓకే చెప్తున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్

చిన్న చిత్రాల హీరోయిన్ గా కెరీర్ ను ఆరంభించిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ తక్కువ సమయంలోనే టాలీవుడ్ లోని స్టార్ హీరోలకు జోడీగా నటించేసింది. ఒకానొక సమయంలో మహేష్ బాబు సినిమా కు డేట్లు లేక నో చెప్పిందంటే ఆ సమయంలో రకుల్ ఎంతగా బిజీగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.

తెలుగు మరియు తమిళంలో ఆఫర్లు తగ్గిన సమయంలో లక్కీగా హిందీలో ఈ అమ్మడు వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు సొంతం చేసుకుంది. కానీ అక్కడ చేసిన సినిమాలన్నీ కూడా నిరాశ పరిచాయి. దాంతో అక్కడ ఆఫర్లు రావడం తగ్గింది. ప్రస్తుతం రకుల్ చేస్తున్న సినిమాలు ఏంటి అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి. అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న రకుల్ చివరకు గ్యాంబ్లింగ్ ప్లాట్ ఫామ్ ను ప్రమోట్ చేస్తోంది.

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ స్టార్ హీరోలకు జోడీగా నటించడం మాత్రమే కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోలకు కూడా మోస్ట్ వాంటెడ్ గా నిలిచిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఆన్ లైన్ రమ్మీ ని ప్రమోట్ చేస్తూ దారుణంగా పడిపోయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

ఈ కమర్షియల్ యాడ్ కు రకుల్ భారీగా పారితోషికం తీసుకుంటుందనే వార్తలు వస్తున్నాయి. అయినా కూడా ఈమె తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. ఆఫర్లు లేకుంటే ఇలా నిషేదిత కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాల్సిన అవసరం ఏంటంటూ విమర్శలు వస్తున్నాయి.

ఆన్ లైన్ రమ్మీ ని పలు రాష్ట్రాల్లో బ్యాన్ చేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అనధికారికంగా బ్యాన్ కొనసాగుతోంది. ఎంత బ్యాన్ విధించినా కూడా దొంగ చాటుగా కొందరు ఆడేస్తున్నారు. పూర్తిగా ఆన్ లైన్ రమ్మీ నుండి యువత బయట పడే విధంగా సెలబ్రెటీలు ప్రచారం చేయాలి కానీ దాన్ని ఇంకా ప్రోత్సహించడం ఏమాత్రం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

తెలుగు లో రకుల్ మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం హాట్ ఫొటో షూట్స్ ను రెగ్యులర్ గా షేర్ చేస్తూనే ఉంది. అందాల విందు విషయంలో ఈ అమ్మడు గతంలో ఎలా అయితే ఉందో.. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా స్కిన్ షో చేస్తోంది.