తమన్నా అతన్ని లాగి పెట్టి కొట్టినా షాక్ అవ్వొద్దు!

మిల్కీ బ్యూటీ తమన్నా-విజయ్ వర్మలు డేటింగ్ లో ఉన్నారా? లేదా? అన్నది క్లారిటీ లేదు. కానీ ఇద్దరిపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రచారం మాత్రం ఠారెత్తిపెతుంది. రిలేషన్ షిప్ పై తమన్నా క్లారిటీ ఇచ్చినా కథనాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా విజయ్ వర్మ స్నేహితుడు గుల్షన్ దేవయ్య నా తమన్నాతో తిరుగుతున్నావా? అంటూ విజయ్ ని ఆటపట్టించేలా వ్యాఖ్యానించడం ఇద్దరి ప్రేమాయణంపై మరింత ఆసక్తి సంతరించుకుంది.

నేరుగా విజయ్ స్నేహితుడే ఇద్దరి గురించి ఇలా స్పందించడంతో? రిలేషన్ షిప్ నిజమేనా? అన్న గుసగుస మళ్లీ మొదలైంది. తాజాగా తన కామెంట్లపై గుల్షాన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసాడు. ‘ది గర్ల్ ఇన్ ఎల్లో బూట్స్’ తో తెరంగేట్రం చేసిన గుల్షన్ దేవయ్య ఇటీవలే పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్బంగా తమన్నా-విజయ్ రిలేషన్ షిప్ గురించి స్పందించాడు.

‘బర్త్ డే అంటే గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఉండదు. హాయిగా రోజంతా నిద్రపోతే చాలు అనిపిస్తుంది. కానీ చాలా మేసేజ్ లు వస్తుండటంతో వాటన్నింటికి బధులివ్వాల్సి వస్తోంది.

కొందరు బంగారం..వజ్రాలు కూడా బహుమతులుగా పంపిస్తుంటారు. నా మాజీ భార్య కలిరోయ్ జియాఫెటా నా పుట్టిన రోజును సెలబ్రేట్ చేఇంది. అందుకు సంతోషంగా ఉంది. ఇక విజయ్ వర్మ-తమన్నా రిలేషన్ షిప్ లో ఉన్నారా? లేదా? అన్నది నాకు తెలియదు.

వారిద్దరు కలిసి ఉన్న రెండు..మూడు ఫోటోలు మాత్రమే చూసాను. ఆమెను నేనెప్పుడు కలవలేదు. నేను వాగింది చూసి తమన్నా నన్ను కొట్టినా ఆశ్చర్యపోకండి. నాగురించి నొటికొచ్చింది వాగుతున్నావేంటని ఆమె కోపగించుకున్నా షాక్ అవ్వొద్దు. ఇప్పటికే తమన్నా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఒకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నీకెంత ధైర్యం అని వార్నింగ్ లు ఇస్తున్నారు.

దీంతో గుల్షాన్ మరోసారి పుల్లవేసాడు. సీరియస్ గా చెప్పాలంటే వాళ్లిద్దరి మధ్య ఏం జరుగుతుందో నాకు ఏం తెలియదని పుల్ల వేసాడు. అది వారి వ్యక్తిగత జీవితం. విజయ్ ని ఏడిపించడానికి ఆసందర్భాన్ని వాడుకున్నాను అంతే’ అని అన్నారు