ధమ్కీ ప్రీరిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా?

విశ్వక్ సేన్ను ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క దర్శకత్వం వహించిన తాజా చిత్రం దాస్ కా ధమ్కీ. గతంలో ఫలక్ నామ దాస్ సినిమాతో విశ్వక్ సేన్ ఒక పక్క హీరోగా ప్రూవ్ చేసుకుంటూనే… మరోపక్క డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత చాలా కాలానికి ఆయనే స్వయంగా దాస్ కా ధమ్కీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

వాస్తవానికి నరేష్ కొప్పిలి అనే డైరెక్టర్ను ముందుగా ఈ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చినా… ఎందుకో సడన్గా ఆయనను తప్పించి విశ్వక్ సేన్ రంగంలోకి దిగాడు. అయితే తరువాత క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగానే ఆయన తప్పుకున్నారు.

మేము బానే ఉన్నాం… ఫ్యూచర్లో కూడా సినిమా చేస్తామని చెబుతున్నాడు విశ్వక్ సేన్. ఆ సంగతి అలా ఉంచితే విశ్వక్ సేన్ కెరియర్లోనే మొట్టమొదటి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

అయితే రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. నైజాం ప్రాంతంలో మూడు కోట్ల రూపాయల వరకు ఈ సినిమా బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. సిడెడ్ ప్రాంతంలో కోటి రూపాయలు ఆంధ్ర ప్రాంతంలో రెండు కోట్ల 80 లక్షల రూపాయల మేర బిజినెస్ జరగడంతో… ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిపి ఆరు కోట్ల 80 లక్షల రూపాయల వరకు తెలుగు వెర్షన్ బిజినెస్ జరిగినట్లుగా చెబుతున్నారు.

కర్ణాటక సహా మిగతా భారతదేశం అలాగే ఓవర్సీస్ కలిపి మరో 70 లక్షల రూపాయలకు రైట్స్ అమ్ముడుపోయాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏడున్నర కోట్లకు అమ్ముడుపోయింది. ఇది కేవలం తెలుగు వెర్షన్ బిజినెస్ మాత్రమే.

కాగా మిగతా భాషల్లో ఎంతవరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే విషయం మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా.. ట్రైలర్ చూస్తే ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నివేదా పేతురాజు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.