నాగచైతన్య.. ఓ ఇంటివాడయ్యాడు!

అక్కినేని నాగచైతన్య ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు చేసినా కూడా డిఫరెంట్ గా ఉండాలని ట్రై చేస్తూనే కమర్షియల్ పాయింట్స్ ను కూడా ఏమాత్రం విడువడం లేదు. అలాగే క్లాస్ లవ్ స్టోరీలను ఉరమాస్ కథలను కూడా ట్రై చేస్తున్నాడు. అంతే కాకుండా కస్టడీ లాంటి యాక్షన్ సినిమాతో కూడా రెడీ అవుతున్నాడు. అయితే నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశాడు.

మురళీమోహన్ ఆయన కుమారులు ఒకేచోట ఉండాలని ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ను నిర్మించుకోగా ఒకరోజు నాగచైతన్య అపార్ట్మెంట్ లోని ఒక ప్లాట్ చూసి ఎంతో ఇష్టపడి దాన్ని భారీ ధరకు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత సమంతతో ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఇక సమంతతో విడిపోయిన తర్వాత మళ్లీ అతను ఆ ప్లాట్ నుంచి బయటకు వచ్చేసాడు.

అయితే సమంత మాత్రం మా ఇంటిని వదిలేయ లేదు. మళ్లీ ఆమె ప్రత్యేకంగా కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు నాగచైతన్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత హోటల్లోనే ఉంటున్నాడు. ఎలాంటి షూటింగ్ ఉన్నా కూడా వీలైనంతవరకు హోటల్స్ లోనే ఉంటూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు ఒక టాక్ అయితే వినిపించింది.

అయితే ఇప్పుడు మాత్రం చైతన్య ప్రత్యేకంగా ఒక ఇల్లును కట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అది కూడా నాన్న అక్కినేని నాగార్జున ఇంటికి చాలా దగ్గరగా ఉండే ఒక ల్యాండ్ ను భారీ ధరకు కొనుగోలు చేశాడట. ఇక గత కొన్ని నెలల క్రితం కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయింది. ఇక మొత్తానికి అది పూర్తయింది. పది రోజుల క్రితమే నాగచైతన్య ఆ ఇంట్లోకి గృహప్రవేశం కూడా చేశాడు.

పూర్తిగా తన ఇష్టంతో నాగచైతన్య ఇంటిని డైజైన్ చేయించుకున్నాడు. ఇక ఆ ఇంట్లోనే ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ జిమ్ మినీ థియేటర్ రూమ్ ఉండేలా డిజైన్ చేయించినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నాగచైతన్య అయితే తన కస్టడీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో నాగచైతన్య ఒక పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.