హీరో గారి పెళ్లి కొత్త అర్థానికి సోషల్ మీడియాలో అక్షింతలు

బాలీవుడ్ యంగ్ హీరో షాహిద్ కపూర్ బ్లడీ డాడీ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన వరుసగా ఏదో ఒక టాక్ షో లో పాల్గొంటూనే ఉన్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా షాహిద్ కపూర్ పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యి.. విమర్శలు ఎదుర్కొంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… షాహిద్ కపూర్ బ్లడీ డాడీ సినిమా యొక్క ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఈ పెళ్లి అనేది ఒకే ఒక్క విషయం పై ఆధారపడి ఉంటుంది. జీవితంపై క్లారిటీ లేని ఒక అబ్బాయి లైఫ్ లోకి పెళ్లి అనే బంధం ద్వారా ఒక అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. అలా ఎంట్రీ ఇచ్చి అతడిని సమస్యల నుండి బయట పడేయడం తో పాటు అతని జీవితానికి ఒక అర్థం ను తీసుకు వస్తుంది.

అతడిని లైఫ్ లో సాఫీగా ముందుకు సాగేలా చేస్తుంది. గమ్యం అంటూ లేని అబ్బాయి జీవితానికి మంచి గమ్యాన్ని ఏర్పర్చి ఇద్దరు కూడా ముందుకు సాగేలా చేస్తుంది అంటూ పెళ్లికి కొత్త అర్థం ను షాహిద్ కపూర్ ఇవ్వడం జరిగింది. షాహిద్ వ్యాఖ్యలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్ ఖండిస్తున్నారు.

షాహిద్ ను ట్రోల్స్ చేస్తున్నాడు. జీవితంలో క్లారిటీ లేని అబ్బాయిలు పెళ్లి చేసుకుని బాగు పడటం ఏంటి అంటూ ఎద్దేవా చేశారు. నువ్వు అలా పెళ్లి తర్వాత బాగు పడ్డావేమో కానీ ఇతరులు అలా కాదు అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

నీ యొక్క ఆలోచన మరియు నీ నిర్వచనం నూటికి నూరు శాతం తప్పు అంటూ కొందరు తీవ్రంగా స్పందించారు. మొత్తానికి షాహిద్ కు సోషల్ మీడియాలో నెటిజన్స్ తో అక్షింతలు బాగానే పడుతున్నాయి. మరి తన వ్యాఖ్యలకు షాహిద్ కపూర్ ఏమైనా స్పందిస్తాడా అనేది చూడాలి.