అంబానీల ఇంట పెళ్లి అంటే మజాకానా! రెండుసార్లు ప్రీవెడ్డింగ్ వేడుకల పేరుతో ఇప్పటికే దాదాపు 2000 కోట్లు ఖర్చు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ కుభేరుడు ముఖేష్ అంబానీకి ఈ ఖర్చు ఏమంత పెద్ద మొత్తం కాదు గనుక.. ఇప్పుడు జూలైలో జరగనున్న చిన్నకొడుకు అనంత్ అంబానీ పెళ్లి కోసం అంతకుమించి ఖర్చు చేస్తాడని అంచనా వేస్తున్నారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఎలా సాగిందో ఈ వేడుకలో ఏం తిన్నారో కూడా సెలబ్రిటీలు గుంపులుగా ఉన్నప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకున్నారు. ఇప్పుడు అంబానీ ఈవెంట్లో తాను ఏం తిన్నదో వెల్లడించింది నటవారసురాలు సారా అలీఖాన్. నిజానికి నీతా అంబానీ- ముఖేష్ అంబానీ అందరి దృష్టిని ఆకర్షించే అత్యంత విలాసవంతమైన పార్టీలు ఇవ్వడంలో ప్రసిద్ధి చెందారు. తమ కుమారుడు అనంత్ అంబానీ వివాహాన్ని దశలవారీగా జరుపుకోవడానికి పవర్ కపుల్ ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేసారు. జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుక తర్వాత అంబానీలు రెండోసారి ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్ కోసం ఫ్రాన్స్‌లో క్రూయిజ్ పార్టీని ఏర్పాటు చేశారు. షారుఖ్ ఖాన్, కియారా అద్వానీ, అలియా భట్ సహా ప్రపంచ దిగ్గజాలు చాలా మంది పెద్దలు రెండు ఫంక్షన్లకు హాజరయ్యారు. ఇటీవలి ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ అంబానీ ఈవెంట్లో భాగం కావడం ఎలా ఉంటుందో తన అనుభవాన్ని షేర్ చేసింది.
ప్రఖ్యాత మిడ్-డేకి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సారా అలీ ఖాన్ జామ్‌నగర్‌లో జరిగిన అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక గురించి వెల్లడించారు. అంబానీలు తినడానికి బంగారాన్ని వడ్డిస్తున్నారని, ఎక్కడ చూసినా వజ్రాలు ఉన్నాయని సారా ఛమత్కరించారు. ”వారు మాకు బంగారం వడ్డిస్తారు.. మేం రోటీతో బంగారం తిన్నాము.. ఒట్టేసి చేస్తున్నాను .. ప్రతిచోటా వజ్రాలు ఉన్నాయి” అని కాస్త సరదాగా సరసంగానే చెప్పారు సారా. అయితే అంబానీలు చాలా ప్రేమగా ఆప్యాయతతో స్వాగతించేవారని సారా అన్నారు. వేడుక వద్ద నిజంగా ప్రత్యేకంగా నిలిచిన క్షణాలు ఉన్నాయి. తాను అనంత్‌తో కలిసి స్కూల్లో చదువుకున్నానని.. రాధిక తనకు తెలుసునని గుర్తు చేసుకుంది సారా. అంబానీ కుటుంబం మొత్తం .. ధీరూభాయి అంబానీ స్కూల్‌కి చైర్‌పర్సన్‌గా ఉన్న నీతా మేమ్ పార్టీకి చాలా ఆప్యాయంగా స్వాగతించారు. అందరూ అంబానీలా చూస్తారని నేను అనుకుంటున్నాను. కుటుంబం వావ్.. బంగారం!! అయితే స్టేజ్‌పై నీతా మేమ్ ప్రదర్శన రియల్లీ స్టన్నింగ్ అని సారా వ్యాఖ్యానించారు.
జూలై నెలలో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే రెండు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లు జరిగాయి. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో అంబానీ అసలు పెళ్లి వేడుక జరగనుంది. తాజాగా ఈ పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రీ వెడ్డింగ్ వేడుకలాగా ఈ ఈవెంట్‌కి ఇండస్ట్రీ నుండి ఎవరెవరు హాజరవుతారోననే చర్చ సాగుతోంది. వరుసగా పెళ్లి రిసెప్షన్ లు అతిథులను ఊరిస్తుంటే ఎవరైనా వెళ్లకుండా ఎందుకు ఉంటారు? పెళ్లి పార్టీ మూడు రోజుల పాటు సాగనుంది.