అదే చివరి సినిమా కావాలనుకున్నా: పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ జన్మదినం సెప్టెంబర్‌ 2. ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాల గ్లింప్స్, పోస్టర్లను ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. ప్రముఖ దర్శకుడు సుజిత్‌ దర్శకత్వంలో వస్తున్న ఓజీ గ్లింప్స్‌ ను విడుదల చేశారు. అలాగే మరో ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో వస్తున్న హరిహర వీరమల్లు చిత్రం పోస్టర్‌ ను పంచుకున్నారు.

పవన్‌ జన్మదినం సందర్భంగా గతంలో ఆయన పలు సినిమా వేడుకల్లో, రాజకీయ వేదికల్లో ప్రసంగించిన అంశాల్లో కొన్ని ముఖ్య విశేషాలు ఇలా ఉన్నాయి.. తాను చిన్నప్పుడు తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడినని పవన్‌ తెలిపారు. ఆయనకు చిన్నతనంలో పెద్దగా స్నేహితులు లేరు. తన సోదరుడు చిరంజీవి సినీ పరిశ్రమలో స్థిరపడేనాటికి పవన్‌ ఇంటర్‌ చదువుతున్నారు. ఆ పరీక్షల్లో తప్పినా తన తల్లిదండ్రులు ఏమీ అనలేదని పవన్‌ పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు.

అందరూ జీవితంలో ముందుకెళుతున్నా.. తాను జీవితంలోక ఉన్నచోట నుంచి ముందుకు వెళ్లలేకపోతున్నానని పవన్‌ బాధపడేవారట. ఈ క్రమంలో ఆ ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు చేసుకోవాలి అని అనిపించేది అంట కుటుంబ సభ్యులు సపోర్ట్ తో అలాంటి థాట్స్ నుంచి బయట పడ్డారు అంట .

తాను చదివినా, చదవక పోయినా తాము ప్రేమిస్తూనే ఉంటామని అన్నయ్యలు చిరంజీవి, నాగబాబులు ఆయనకు భరోసా ఇచ్చారు. అలాగే జీవితంలో స్పష్టత ముఖ్యమని… ముందు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకోవాలని తన అన్నయ్యలతో వదిన సురేఖ అండగా నిలబడ్డారని పవన్‌ గుర్తు చేసుకున్నారు.

అందరూ జీవితంలో ముందుకెళుతున్నా.. తాను జీవితంలోక ఉన్నచోట నుంచి ముందుకు వెళ్లలేకపోతున్నానని పవన్‌ బాధపడేవారట. ఈ క్రమంలో ఆ ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు చేసుకోవాలి అని అనిపించేది అంట కుటుంబ సభ్యులు సపోర్ట్ తో అలాంటి థాట్స్ నుంచి బయట పడ్డారు అంట.

తాను చదివినా, చదవక పోయినా తాము ప్రేమిస్తూనే ఉంటామని అన్నయ్యలు చిరంజీవి, నాగబాబులు ఆయనకు భరోసా ఇచ్చారు. అలాగే జీవితంలో స్పష్టత ముఖ్యమని… ముందు ఏం కావాలనుకుంటున్నావో నిర్ణయించుకోవాలని తన అన్నయ్యలతో వదిన సురేఖ అండగా నిలబడ్డారని పవన్‌ గుర్తు చేసుకున్నారు.

ఆ తర్వాత ఎప్పటికో ఒక చిత్రంలో నటించే అవకాశం పవన్‌ కు వచ్చింది. అయితే మూడేళ్లు గడిచినా ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాకపోవడంతో మళ్లీ ఆయనలో నిరాశ మొదలైందట. ఆ సినిమా కోసం ఎదురుచూసే ఓపిక లేక బెంగళూరులో నర్సరీ పెట్టాలని నిర్ణయించుకున్నారు. తనకు తెలిసిన పని అదొక్కటే కాబట్టి.. నర్సరీ వైపు వెళ్తానని తన అమ్మకు చెప్పేశారు.

అయితే పవన్‌ తన తల్లి అంజనాదేవికి చెప్పిన రోజు సాయంత్రమే ఆ సినిమా షూటింగ్‌ మొదలవుతుందనే విషయం తెలిసింది. సినిమా మొదలయ్యాక అసందర్భమైన డ్యాన్సులు, వారిచ్చే కృతకమైన బట్టలు వేసుకోవడం పవన్‌ కు ఇష్టముండేది కాదట. దీంతో మొదటి సినిమానే చివరి సినిమానే కావాలని బలంగా కోరుకున్నారు. అయితే ఇంతలోనే రెండో సినిమా.. గోకులంతో సీత అవకాశం వచ్చింది. మొహమాటం కొద్దీ పవన్‌ ఆ సినిమాను చేయాల్సి వచ్చిందట.

తన రెండో సినిమా.. గోకులంతో సీత సినిమా అప్పటి నుంచి సినీ పరిశ్రమలో పని, ఆ వాతావరణం పవన్‌ కు నిదానంగా అలవాటయ్యాయి. నాటి నుంచి కష్టంతో కాకుండా.. ఇష్టంతో నటించడం మొదలుపెట్టారు. ఫలితం కాదు ముఖ్యం.. ప్రయాణమే ముఖ్యమని నమ్మడం ప్రారంభించారు. అయినా తన మనసు అప్పుడప్పుడు వినకపోవడంతో జానీ సినిమా తర్వాత ఇక సినిమాలు చేయకూడదని భావించారు.

అయితే జానీ తర్వాత కూడా ఆయన కుటుంబం.. ఈ ఒక్క సినిమా చేయ్‌.. తర్వాత మానేద్దువు అంటూ ప్రోత్సాహం అందజేస్తూ వచ్చింది. అలా ఒకదాని తర్వాత ఒకటి ఇప్పటిదాకా పవన్‌ సినిమాలు చేస్తూ వచ్చారు. ఇది తాను కోరుకున్న జీవితం కాదని.. భగవంతుడు ఇలా నడిపిస్తున్నాడని పవన్‌ పలు సందర్భాల్లో చెప్పారు. నటుడిని కావాలని, రాజకీయ నాయకుడిని అవ్వాలని తాను ఎప్పుడూ అనుకోలేదు అని వెల్లడించారు.

రాజకీయ పార్టీ పెట్టాక కూడా తాను సినిమాల్లో నటించనని చెప్పారు. సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ చిత్రమే ఆయనకు చివరి చిత్రం అవుతుందని వార్తలు వచ్చాయి. ఆ సినిమా ఆడియో ఫంక్షన్‌ కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి.. పవన్‌ నిర్ణయం సరికాదని.. మీరయినా చెప్పండి అంటూ పవన్‌ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అటు సినిమాలు, రాజకీయాలు.. రెండు గుర్రాల మీద స్వారీ చేయగల సామర్థ్యం పవన్‌ కు ఉందని.. కాబట్టి సినిమాలు వదిలేయవని భావిస్తున్నానని పవన్‌ కు సూచించారు. దీంతో తన అన్నయ్య మాట కాదనలేక, మరోవైపు పార్టీని నడిపించడానికి అవసరమైన ఆర్థిక వనరుల కోసం తాను సినిమాలు చేస్తున్నానని పలు సందర్భాల్లో పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు.