అనిల్ రావిపూడిని అంత మాట అనేసాడేంటి?

అనిల్ రావిపూడి తీసే సినిమాలు మూసగా ఉంటాయని విమర్శలు వస్తుంటాయి కానీ అవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఆడేస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు తర్వాత అనిల్ తో చేయడానికి అగ్ర హీరోలు ఉత్సాహపడక పోవచ్చు కానీ యువ హీరోలు అతని సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకోరు. అయితే విశ్వక్ సేన్ కి మాత్రం నోట్లో ఫిల్టర్ లేదు.

ఏదనిపిస్తే అది మాట్లాడేసే సేన్ తనకి నచ్చని సినిమా గురించి చెప్పమంటే టక్కున ఎఫ్2 అనేశాడు. ఆ సినిమా పెద్ద హిట్టయింది కానీ తానూ ఆ కామెడీని పావుగంటకి మించి చూడలేక వాకౌట్ చేసానని విశ్వక్ టీవీ షోలో చెప్పాడు. తనకి సునిశితమయిన హాస్యం ఇష్టం అని అలాంటివి చూడలేనని అన్నాడు.

జనరల్ గా ఇలాంటి ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వకుండా దాటవేయడమో లేదా డిప్లొమాటిక్ గా చెప్పడమే చేస్తారు తప్ప అలా టాప్ డైరెక్టర్ సినిమాని కామెంట్ చేసేయరు. అయితే అనిల్ రావిపూడి సినిమాలకి విమర్శలు కొత్త ఏమీ కాదు కాబట్టి విశ్వక్ మాటలని అతను పట్టించుకోక పోవచ్చు. కానీ ఇంత మంది తన క్రియేటివ్ వర్క్ ని కిండల్ చేస్తున్నారంటే లోపం ఎక్కడుందనేది కూడా తర్కించుకోవచ్చు.