అరవింద్.. కేఎల్ నారాయణ.. కొరటాల శివ?

కొరటాల శివ ఇప్పట్లో సినిమా చేయరని కొందరు, చేస్తాడని కొందరు, ఇలా రకరకాల వార్తలు. బన్నీ తప్ప వేరే ఆప్షన్ లేదని, కాదు, వేచి వుండయినా ప్రభాస్ తో చేస్తాడని మరి కొన్ని వార్తలు. అయితే ఏవి నిజమో, ఏవి కాదో ఎవ్వరికీ తెలియదు. ప్రస్తుతానికి అయితే కొరటాల శివ రెస్ట్ మూడ్ లో వున్నారన్నది మాత్రం వాస్తవం.

ఇదిలా వుంటే కొరటాల శివతో సినిమా చేసేందుకు అల్లు అరవింద్-కేఎల్ నారాయణ కలిపి డిసైడ్ అయ్యారని మరో వార్త పుట్టుకువచ్చింది. అయితే హీరో ఎవరు? అన్నది మాత్రం తెలియడం లేదు. అరవింద్ వున్నారు కాబట్టి బన్నీనా? లేక ప్రభాస్ తో అరవింద్ కు కూడా మంచి సంబంధాలు వున్నాయి కాబట్టి కొరటాల కోరుకున్నట్లు అటు వెళ్తారా? ఏమో తెలియాల్సి వుంది.

కానీ ఈ సంగతి అలావుంచితే ఇప్పటికే ఒక సినిమాను కొరటాల శివ తన మిత్రుడు సుధాకర్ కు చేయాల్సి వుంది. అలాగే మరో సినిమాను నిర్మాత నిరంజన్ రెడ్డికి చేయాల్సి వుంది. మరి ఆ రెండు పక్కన పెట్టి కేఎల్ నారాయణ-అరవింద్ లకు చేస్తారా? ఒక వేళ అదే నిజమైతే ఏది ముందు? ఏది వెనుక? తెలియాల్సి వుంది.