‘ఆదిపురుష్’ సినిమా మొదలైన నాటి నుంచి ప్రధానంగా ముగ్గురు-నలుగురు మాత్రమే హైలైట్ అవుతున్నా రు. వాళ్లే హీరో ప్రభాస్..హీరోయిన్ కృతిసనన్…ప్రతి నాయకుడు సైఫ్ అలీఖాన్..కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఓంరౌత్. చిత్ర నిర్మాణ సంస్థ 500 కోట్లు పెట్టి సినిమా నిర్మించడం. వీళ్లందరి శ్రమ ఈనెల 16 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. మూడేళ్ల పాటు సినిమా కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడింది. మరి అంతిమంగా ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.
ఓసారి ప్రధాన నటీనటుల స్టాటస్ చెక్ చేస్తే… డార్లింగ్ ప్రభాస్ కిది 21వ సినిమా. రాముడి పాత్ర లో తొలిసారి నటిస్తున్నారు. మాస్ ..యాక్షన్ సినిమాలు చేసినా ఆయన కు ఈ అనుభవం ఎంతో ఆసక్తికరం. అయితే ‘బాహుబలి’ సినిమా లో బాహుబలి గా మెప్పించడంతో! రాముడి ఆహార్యం లోకి ఒదిగిపోవడం కొంచెం సులువుగానే జరిగుండొచ్చు. బాహుబలి జానపదం అయితే.. ఆదిపురుష్ ని మైథలాజికల్ జానర్ గా చెప్పాలి. రాముడి లుక్ లో ప్రభాస్ ఆకట్టుకుంటున్నాడు. ఫస్ట్ లుక్ చూసి ఆ పాత్రకు తగ్గ నటుడంటూ ప్రశంసలందుకున్నాడు. మనం జన్మతో కాదు.. చేసే కర్మతో చిన్నా పెద్దా అవుతాం వంటి డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.
సినిమా లో నటించడం ప్రభాస్ అదృష్టంగా భావిస్తున్నారు. ఇక హీరోయిన్ కృతి సనన్ కిది 16 వ చిత్రం. ‘నేనొక్కడినే’ సినిమా తో కృతి సనన్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘దోచెయ్’ లో నటించింది. రెండు ఆవిడ కి పెద్ద విజయాలు అందించలేదు. దీంతో ఆదిపురుష్ పై చాలా ఆశలే పెట్టుకుంది. ఇందులో సీత పాత్ర లో మెప్పించబోతుంది. అలాగే సైఫ్ అలీఖాన్ కిది 64వ సినిమా. ఈ సినిమా తో నే ప్రతి నాయకుడి గా టాలీవుడ్ లో లాంచ్ అవుతున్నారు. ఇందులో లంకేశ్వరుడి పాత్ర లో కనిపించనున్నారు. గతంలో ఓం రౌత్ తెరకెక్కించిన ‘తానాజీ’లోనూ విలన్ పాత్ర లో మెప్పించాడు.
అందుకే మరోసారి ఓంరౌత్ సినిమా లో విలన్ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమా లోనూ విలన్ గా నటిస్తున్నారు. ఈ కార్యాన్ని తలపెట్టిన దర్శకుడు ఓరౌంత్ కి దర్శకుడిగా అంత అనుభవం లేదు. ఇది దర్శకుడిగా 3వ సినిమా. ఇది తలకు మించిన భారమైనా ఓ ఫ్యాషన్ తో .. ఎంతో బాధ్యతగా చేసిన చిత్రమిది. రామాయణం లాంటి కథని సినిమా గా మలచడం అంటే చిన్న విషయం కాదు.
అందులోనూ ఇలాంటి కథ లో ఎక్కడా ట్రాక్ తప్పినా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటికి ఏమాత్రం తావు ఇవ్వకుండా..ప్రేక్షకుల్ని ఎక్కడా నొప్పించకుండా చేయగల్గాలి. మరి ఈ విషయం లో ఓం రౌత్ ఎంత వరకూ సఫలం అవుతారో? రిలీజ్ తర్వాత తెలుస్తుంది. ఈయన న్యూయార్క్ యూనివర్శిటీలో పోస్ట్ ఫిల్మ్ గ్రాడ్యూషన్ పూర్తిచేసారు. ఆయన తాతయ్యకి కూడా సినిమాలంటే పిచ్చి ఉంది. అదే ఫ్యాషన్ రౌత్ కి వచ్చింది. ఈ చిత్రాన్ని టీ-సిరీస్- రెట్రిఫిలైప్స్ సంయుక్తంగా 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించాయి.