ఆ సినిమాను విమర్శించిన వారంతా టెర్రరిస్టులేనట!

అదా శర్మ ప్రధాన పాత్రలో సుదీప్తో సేన్ దర్శకత్వంలో రూపొంది మే 5వ తారీకున ప్రేక్షకులమ ఉందుకు వచ్చిన ది కేరళ స్టోరీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా టీజర్ విడుదల అయినప్పటి నుండి కూడా కొందరు సినిమా పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. సినిమాను విడుదల అవ్వనిచ్చేది లేదు అంటూ హెచ్చరిస్తూ వచ్చారు.

తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమా పై ఉన్న వివాదం కారణంగా విడుదలకు నో చెప్పింది. కేరళలో కూడా చాలా థియేటర్లలో ఆందోళనల కారణంగా షో లు క్యాన్సిల్ చేయడం జరిగింది. దేశంలో పలు చోట్ల ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నా కూడా కోర్టు ఆదేశాలు.. మద్దతు కారణంగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ది కేరళ స్టోరీకి మద్దతుగా మాట్లాడటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చ మరింతగా జరుగుతోంది. నిన్న విడుదల కాని చోట్ల కూడా త్వరలోనే సినిమాను విడుదల చేసే విధంగా యూనిట్ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.

కేరళకు చెందిన అమ్మాయిలను మతం మార్చి టెర్రరిస్టులుగా మార్చుతున్న కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఈ సినిమా గురించి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ది కేరళ స్టోరీ సినిమాను ఇంకా చూడలేదు. అయితే ఆ సినిమాను నిషేదించాలంటూ చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కోర్టు సినిమాను నిషేదించాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా కొందరు అడ్డుకోవడం దారుణం.

ఈ సినిమాను ఎవరైతే అడ్డుకోవాలని చూస్తున్నారో… ఎవరైతే ది కేరళ స్టోరీ ని వ్యతిరేకిస్తున్నారో వారంతా కూడా ఉగ్రవాదాన్ని సమర్థిస్తున్నట్లే… వారంతా కూడా ఉగ్రవాదులు అన్నట్లే అంటూ కంగనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉగ్రవాదం కు వ్యతిరేకంగా తెరకెక్కించిన సినిమా కు వ్యతిరేంగా మాట్లాడటం పై కంగనా సీరియస్ గా స్పందించింది. ఈ విషయంలో చాలా మంది కంగనా కు మద్దతుగా నిలుస్తున్నారు.