టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్-1 మరికొద్ది రోజుల్లో రిలీజ్ అవ్వనున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఆ మూవీ.. సెప్టెంబర్ 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ ప్రమోషన్స్ లో ఫుల్ స్పీడ్ పెంచారు. ప్రస్తుతం నార్త్ లో సందడి చేస్తున్న దేవర మేకర్స్.. త్వరలో అన్ని భాషల్లో కూడా ఆడియన్స్ లో బజ్ పెంచే ప్రయత్నం చేయనున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ రీసెంట్ గా ట్రైలర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. కోస్టల్ ఏరియా నేపథ్యంతో హై ఓల్టేజ్ యాక్షన్ తో మూవీ ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది. వైల్డ్ ఎంటర్‌టైనర్ గా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. సముద్రపు దొంగలతోపాటు సముద్రంలో జరిగే సాహసాల చుట్టూ సినిమా అంతా తిరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే ఈజీగా అర్థమవుతుంది. సముద్ర తీర ప్రాంత ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రతీకారం తీర్చుకునే పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు.
ప్రజలకు విముక్తి కల్పించేందుకు నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా సినిమాలో తారక్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా “చాలా పెద్ద కథ.. రక్తంతో సంద్రంతో ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ” అనే డైలాగ్ బట్టి.. న్యాయం కోసం మూవీలో భీకర పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, సైఫ్ అలీఖాన్ మధ్య వేరే లెవెల్ లో ఫైట్ సీక్వెన్స్ ఉండనున్నట్లు అర్థమవుతుంది. మొత్తానికి ట్రైలర్.. సినిమాపై అంచనాలు పెంచేసింది. లోతైన కథతో మూవీ రానున్నట్లు క్లారిటీ ఇచ్చింది.
అయితే సముద్రపు అడ్వెంచర్స్ తో తెరకెక్కిన చిత్రాల్లో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీంతో కొరటాల VFX విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పైరేట్ జోనర్ లో వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. భారీ బడ్జెట్.. స్టార్ క్యాస్టింగ్ ఉన్నప్పటికీ అమీర్ ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్, మరక్కర్ వంటి పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాయి.
అదే పైరేట్ జోనర్ లో మాస్ ఎంటర్టైనర్ గా దేవర మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు కొరటాల. ఇప్పుడు ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. బాక్సాఫీస్ వద్ద దేవర మంచి హిట్ అయితే.. అందరూ ప్రశంసించాల్సిన విషయమని చెబుతున్నారు. భారీ స్థాయిలో పైరేట్ జోనర్ లో పాన్ ఇండియా సూపర్ హిట్ మూవీ తీసిన డైరెక్టర్ గా చరిత్రలో కొరటలా నిలిచిపోతారని అంటున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేస్తారని చెబుతున్నారు. మరేం అవుతుందో చూడాలి.