మెగావారసుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో జరిగిన అంగరంగ వైభంగానే జరిగింది. ఇటలీలో పెళ్లి..అంత హడావుడి ఏముంటుంది? పెళ్లి చేసుకుంటారు? వస్తారు అన్న నానుడిని మెగా ఫ్యామిలీ మార్చేసింది. డెస్టినేషన్ వెడ్డింగ్ అయినా వేడుక హైదరాబాద్ లో జరుగుతున్నట్లే అనిపిం చింది. అందుకు కారణంగా మెగా ఫ్యామిలీ అంతా సకుటుంబసపరివార సమేతంగా ఇటలీ వేడుకలో పాల్గొనడమే కారణం.
వేడుకలో ఏ ఒక్కరూ మిస్ కాలేదు. చిరంజీవి దంపతులు…పవన్ కళ్యాణ్ దంపతులు.. అల్లు వారి కుటుంబం..చిరంజీవి తోబుట్టువులు.. అల్లుళ్లు…మేనల్లుళ్లు.. మనవలు అంతా హాజరయ్యారు. పెళ్లికి రెండు రోజులు ముందుగానే అంతా హజరవ్వడంతో హడావుడి అప్పటి నుంచే మొదలైంది. హల్దీ… మెహందీ…పెళ్లి లో ఫ్యామిలీ సభ్యులంతా ఒకే ప్రేమ్ లో కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు.
అలాగే నితిన్ దంపతులు కూడా హాజరవ్వడం అదనపు ఆకర్షణగా మారింది. ఆ మూడు వేడుకలకు సంబంధించిన ప్రతీ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి. మెగా బ్రదర్స్ …మెగా అక్కచె ల్లెమ్మ లు…మెగా అల్లుళ్లు.. మెగా కోడళ్లు అంతా ఒకే చోట కలిసి సందడి చేసిన దృశ్యాలు అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది నిజంగా రేర్ మూవ్ మెంట్. ఇంత మంది ఒకే చోట కలవడం అన్నది ఇంతవరకూ ఎప్పుడూ జరగ లేదు.