ఈ స్టైల్ తో డేంజరే శర్వా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాముడు మంచి బాలుడు అనే మాట చాలా తక్కువ మంది హీరోలకు సెట్ అవుతుంది. ఇక అలాంటివారిలో శర్వానంద్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. శర్వా ఎలాంటి సినిమా చేసిన కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అయితే అతను కెరీర్ మొత్తంలో కథలు మారుతున్నా క్యారెక్టర్ విషయంలో అంతగా కొత్తగా ఏమి హైలెట్ కావడం లేదు. మంచి నటుడే కానీ ఘాటు లేని చేపకూరలా క్యారెక్టర్ లు ఉంటున్నాయనే కామెంట్స్ వస్తున్నాయి. ఒకే రకమైన పద్ధతిలో వెళ్లడం కూడా అతని కెరీర్ స్థాయి మరో లెవల్ ను దాటడం లేదు. PlayUnmute /

నిన్నా మొన్న వచ్చిన హీరోలు కూడా సాఫ్ట్ లవ్ స్టోరీ లు కాకుండా లోకల్ కంటెంట్ మాస్ ఎలిమెంట్స్ ఉండే విధంగా కథలను సెలెక్ట్ చేసుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇటీవల విశ్వక్ గామీ కూడా అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక నిఖిల్ కార్తికేయ లాంటి సినిమాలతోనే తన కెరీర్ రేంజ్ ను పెంచుకున్నాడు. ప్రస్తుతం కూడా అతను స్వయంభు అనే మరో ప్యాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.

రొటీన్ మాస్ స్టైలిష్ సినిమాలు చేసే కళ్యాణ్ రామ్ కూడా బింబిసారా అంటూ మరొక పద్ధతిలో సక్సెస్ అందుకున్నాడు. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో ఏకంగా 100 కోట్ల మార్కెట్ ను టచ్ చేశాడు. నాగచైతన్య కూడా పూర్తిస్థాయిలో లవ్ స్టోరీలను సాఫ్ట్ కథలను పక్కన పెట్టేసి హెవీ ఎమోషన్ తో మాస్ ఎలిమెంట్స్ ఉన్న తండేల్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ కూడా యాక్షన్ స్టైలిష్ కథలను మొన్నటివరకు బాగానే చేశాడు. కానీ అవి రివర్స్ అయ్యాయి. దీంతో ఇప్పుడు అతను మట్కా అనే కథతో ఊర మాస్ ఫ్లేవర్ ను టచ్ చేస్తున్నాడు.

ఇలా శర్వానంద్ రేంజ్ లో ఉన్న హీరోలు అందరూ కూడా మట్టి వాసనను టచ్ చేయడం లేదంటే ఏదైనా థ్రిల్లర్ హారర్ కంటెంత్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ శర్వా మాత్రం లోకల్ మాస్ ఆడియెన్స్ ను టచ్ చేసే కథలను సెలెక్ట్ చేసుకోవడం లేదు. ఆ మధ్య ఒకే ఒక జీవితం అనే సినిమాతో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ ను టచ్ చేసినప్పటికీ అందరికి కనెక్ట్ కాలేకపోయింది.

ఇక ఇప్పుడు శర్వానంద్ 36వ సినిమా బైక్ రేసింగ్ నేపథ్యంలో రాబోతుంది. ఇలాంటి కథలు అంత ఈజీగా క్లిక్ కావు. ఆడియెన్స్ కు బైక్ రేసింగ్ స్టైలిష్ యాక్షన్ కథలు రొటీన్ అయిపోయాయి. ఇలాంటి కథలు బాలీవుడ్ లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇలాంటి వాటిలో ఫ్యామిలీ ఎమోషన్స్ లేదంటే, సాడ్ లవ్ స్టోరీ దాని బ్యాగ్రౌండ్ లో బైక్ రేసింగ్ ఉండడం కామన్. అలాగే అప్పటివరకు ఏదో కోల్పోయిన హీరో మళ్ళీ తన పాత జీవితంలోకి రావడం అనే పద్ధతిని చాలా సినిమాలలో వాడేసారు. అందులో సైఫ్ అలీ ఖాన్ తర రమ్ పమ్ అనే సినిమా ఒకటి.

అయితే ఇలాంటి సినిమాలు ఎమోషన్ క్లిక్కయితే మాత్రం ఇప్పట్లో అవార్డులు అందుకుంటాయేమో.. కానీ కలెక్షన్స్ రావు అనేలా కామెంట్స్ వస్తున్నాయి. శర్వా తన పాత్రల విషయంలో ఇంకా చాలా మార్పులు చేయాల్సింది. ఇప్పటివరకు అతనిలో ఒకే తరహా నటుడు కనిపించాడు అనే కామెంట్ ఉంది. కాబట్టి ఆ తర్వాత కథలు సెలెక్ట్ చేసుకుంటే క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటే బెటర్ అనే విధంగా సోషల్ మీడియాలో కామెంట్స్ వినబడుతున్నాయి.