తెలుగు ‘బిగ్ బాస్’ షో మొదలు కావడానికి ఇలాంటి కార్యక్రమం మన దగ్గర అసలు వర్కవుట్ అవుతుందా అని చాలామంది సందేహించారు. కానీ తొలి సీజన్లో పార్టిసిపెంట్ల సపోర్టుతో జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో షోను నడిపించి ‘బిగ్ బాస్’ను సూపర్ హిట్ చేశాడు. కానీ అభిమానులకు తీవ్ర నిరాశ మిగులుస్తూ తర్వాతి సీజన్లో అతను షో నుంచి తప్పుకున్నాడు.
ఈ షోకు డేట్లు కేటాయించలేకపోవడంతో అతడి స్థానంలో నాని వచ్చాడు. అతడి వ్యాఖ్యానానికి కొందరు ప్రేక్షకుల నుంచి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ రావడం.. సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి రావడంతో తర్వాతి సీజన్ నుంచి తప్పుకున్నాడు.
దీంతో మూడో సీజన్లో అక్కినేని నాగార్జున సీన్లోకి వచ్చాడు ఇక నాలుగో సీజన్లో ఎవరు ‘బిగ్ బాస్’ హోస్ట్ అవుతారనే విషయంలో సస్పెన్సు నడుస్తోంది. నాగార్జునే తర్వాతి సీజన్లో కూడా కొనసాగవచ్చని ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ టైంలో జనాలంతా టీవీలకు అతుక్కుపోయి ఉండటం.. కొత్త ప్రోగ్రాంలు ఏవీ చేసే అవకాశం లేకపోవడంతో మాటీవీ వాళ్లు ‘బిగ్ బాస్’ వినోదాన్ని ప్రేక్షకులకు మళ్లీ చూపించాలని ఫిక్సయ్యారు. ఇందుకోసం వాళ్లు ఎంచుకున్నది ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ హోస్ట్‌గా చేసిన తొలి సీజన్‌నే.
ఆదివారం నుంచే ‘బిగ్ బాస్’ సీజన్-1 మా టీవీలో పున:ప్రసారం అవుతోంది. ‘బిగ్ బాస్’ మళ్లీ టెలికాస్ట్ చేయాలనుకున్నపుడు అత్యంత రసవత్తరంగా సాగిన రెండో సీజన్ ఉంది. దాన్ని కాదని.. నాగ్ హోస్ట్ చేసిన మూడో సీజన్ కూడా కాదని.. ఎన్టీఆర్ హోస్ట్‌గా ‘బిగ్ బాస్’ను లాంచ్ చేసిన తొలి సీజన్ ప్రసారం చేస్తున్నారంటే అతను చేసిన షోకే ఎక్కువ ఆదరణ ఉంటుందని.. ముగ్గురు హోస్ట్ల్లో అతను ది బెస్ట్ అని చెప్పకనే చెబుతున్నట్లే. ఐతే అసలే తారక్‌ను మిస్సవుతున్న ఫ్యాన్స్.. మళ్లీ అతణ్ని హోస్ట్‌గా చూస్తే నాలుగో సీజన్‌కు అయినా అతను తిరిగి రావాలని గట్టిగా డిమాండ్ చేయడం ఖాయం.