సత్యభామ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించేంత న్యాచురల్ గా నటించి మెప్పించిన జమున తెలుగు వారికి ఎప్పటికీ ఆన్ స్క్రీన్ సత్యభామగా మిలిగి పోతారు అనడంలో సందేహం లేదు. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు మరియు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆమెకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో మరియు ఇతర మీడియాలో ఆమె సన్నిహితులు చర్చించుకోవడం తో వైరల్ అవుతున్నాయి.
పలువురు అప్పటి విషయాలను నెమరు వేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా 2 సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూ లో జమున మాట్లాడుతూ… శ్రీకృష్ణ తులాభారం సినిమా షూటింగ్ సమయంలో నేను ఎన్టీఆర్ గారిని తలపై తన్నాను అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. నిజం చెప్పాలంటే అలాంటిదేమీ జరగలేదు.
ఆ సమయంలో ఒక సన్నివేశం షూట్ చేస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి నా కాలు అనుకోకుండా తలిగింది. వెంటనే నేను క్షమాపణలు చెప్పాను.. అంతే తప్ప నేను ఉద్దేశపూర్వకంగా ఆయనను తన్నలేదు.. ఆయన ఒక దేవుడు అని.. అలాంటి దేవుడిని కాలితో ఎలా తంతాం అంటూ జమున ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక సావిత్రితో ఉన్న అనుబంధం గురించి జమున ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మిస్సమ్మ దొంగ రాముడు అప్పుచేసి పప్పుకూడు వంటి సూపర్ హిట్ సినిమాల్లో మేము అక్క చెల్లెలుగా నటించాం. సినిమాల వరకే మా అనుబంధం పరిమితం కాకుండా వ్యక్తిగతంగా కూడా మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం.
సావిత్రి నన్ను చెల్లి అని పిలుస్తుండేది. నా పెళ్లి కి ఆహ్వానిస్తే ఇంటికి వచ్చి నన్ను రెడీ చేసి ఇంట్లో వ్యక్తి మాదిరిగా పెళ్లి పనులన్నీ చేసింది. అయితే కొందరు గిట్టని వాళ్లు మా మధ్య తగవు పెట్టారు. దాంతో మేమిద్దరం ఏడాది కాలం పాటు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత అసలు విషయం తెలిసిపోయి ఇద్దరం మాట్లాడుకున్నాం.
చివరిసారి సావిత్రి గారిని చెన్నైలో చూశాను. ఆ సమయంలో ఆమెను చూసి మనస్సు చెల్లించి పోయిందని జమున ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల పాటు సినిమా పరిశ్రమలో సేవలందించిన జమున ఆ తర్వాత కూడా ఎన్నో చిన్న చిన్న పాత్రలు చేసే అవకాశం వచ్చినా కూడా నో చెప్పారు. డబ్బు కోసం పేరును చెడగొట్టుకోలేను అంటూ చిన్న పాత్రలను జమున వదిలేశారట.