ఈమద్య కాలంలో బాలీవుడ్ తో పాటు అన్ని చోట్ల కూడా బయోపిక్ లు ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖుల బయోపిక్స్ వరుసగా వస్తున్న ఈ సమయంలో మాజీ ప్రధాని ఐరెన్ లేడీ ఇందిరా గాంధీ బయోపిక్ ను కూడా తీయబోతున్నట్లుగా కొన్ని రోజుల క్రితం విద్యాబాన్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఆమె భర్త ఆధిత్య రాయ్ కపూర్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవలే శకుంతలదేవి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విద్యా బాలన్ తదుపరి చిత్రంగా ఇందిరా గాంధీ బయోపిక్ ను చేసే అవకాశం ఉందనుకున్నారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విద్యా బాలన్ ఆ విషయమై క్లారిటీ ఇచ్చింది. ఇప్పట్లో ఇందిరా గాంధీ బయోపిక్ ఉండక పోవచ్చు అంది. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభం అయ్యింది. అయితే స్క్రిప్ట్ విషయంలో చర్చలకు ఆలస్యం అవుతోంది. ఇందిరా గాంధీ గురించి చాలా డెప్త్ గా రీసెర్చ్ చేయాల్సి వస్తుంది. అందుకు సమయం పడుతుందని విద్యా చెప్పుకొచ్చింది. ఆమె మాటలను బట్టి చూస్తే ఆ బయోపిక్ ఈ ఏడాదిలో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు.
రాజకీయంగా కూడా ఒత్తిడి ఉండే అవకాశం ఉండటంతో విద్యాబాలన్ అండ్ టీం కాస్త వెనుకంజ వేస్తున్నారా అనేది కొందరి అనుమానం. శకుంతలదేవి పాత్రకు పూర్తి న్యాయం చేసిన విద్యా బాలన్ ఖచ్చితంగా ఇందిరా గాంధీ పాత్రలో జీవించడం ఖాయం అంటున్నారు. అందుకే ఐరెన్ లేడీ ఇందిరా గాంధీ బయోపిక్ కోసం సినీ ప్రేక్షకులు మరియు రాజకీయ వర్గాల వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో విద్యాబాలన్ ఉసూరుమనిపించే వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రారంభ విషయమై ఆలస్యం అయినా ఖచ్చితంగా సినిమా మాత్రం ఉంటుందని ఆమె చెబుతోంది.