ఒక సినిమా సూపర్ హిట్ అయినప్పుడు దానికి సీక్వెల్ తీయాలని చాలా మంది దర్శకనిర్మాతలు ఆరాటపడతారు. అలా సీక్వెల్ గా వచ్చిన అన్ని సినిమాలు హిట్ కాకపోవచ్చు. కానీ సల్మాన్ ఖాన్ టైగర్ మాత్రం.. రెండు పార్ట్ లు బ్లాక్ బస్టర్ అయ్యాయి.
ఏక్ థా టైగర్ తో ఈ టైగర్ సీక్వెన్స్ మొదలైంది. మొదటి సినిమా 2012లో విడుదలైంది. తర్వాత సీక్వెన్స్ 2017లో టైగర్ జిందా హై పేరుతో విడుదల చేశారు. ఈ రెండూ పార్ట్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. రూ.100కోట్లకు పైగా వసూళ్లురాబట్టాయి. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ రా ఏజెంట్ గా కనిపించాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మరో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఈ టైగర్ 3 లో సల్మాన్ తో పాటు ఫారూక్ కూడా నటిస్తుండటం విశేషం.
ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారంటే సినిమాకి విపరీతమైన హైప్ వచ్చేస్తుంది. హైప్ తో పాటు సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోతుంది. అందులోనూ ఇది యాక్షన్ మూవీ కావడంతో బడ్జెట్ ఇంకా పెరిగే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే8వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
కాగా సల్మాన్ షారూక్ మధ్య యాక్షన్ చాలా ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇరు స్టార్ల ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేయగలరట. కేవలం వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ కోసమే నిర్మాత ఏకంగా రూ.35కోట్లు ఖర్చు చేస్తుండటం విశేషం. ఒక్క సెట్ కోసమే నిర్మాత రూ.35కోట్లు పెట్టడానికి ముందుకు రావడం విశేషం.
ఇంత ఖర్చు చేసి వారు ఆడ్రినలిన్ పంపింగ్ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఈ లెక్కన ఇక మిగిలిని సినిమాకి ఎంత ఖర్చు అవుతుందా అని సినీ ప్రియులు లెక్కలు వేయడం మొదలుపెడుతున్నారు. ఈ సినిమా ఈ ఏడాది దిపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటిస్తోంది. ఈ టైగర్ 3 కోసం టైగర్ x పఠాన్ సీక్వెన్స్ దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు సాగుతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.