ఓల్డ్ విశాఖ కోసం 15 కోట్లు..35 రోజులు అందులోనే!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కెరీర్ లో తొలి భారీ బ‌డ్జెట్ చిత్రంగా `మ‌ట్కా` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. `ప‌లాసా` ఫేం క‌ర‌ణ్ కుమార్ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఈ క‌థ ఏకంగా ప్రేక్ష‌కు ల్ని 60 ఏళ్లు వెనక్కి తీసుకెళ్ల‌బోతుంది. 1958-82 మ‌ధ్య సాగే స్టోరీ ఇది. అప్ప‌ట్లో యావ‌త్ దేశాన్ని క‌ద‌లిం చిన వైజాగ్ లో చోటు చేసుకున్న ఓ య‌ధార్ధ సంఘ‌ట‌న ఆ ధారంగా ఈ చిత్ర‌న్ని రూపొందిస్తున్నారు.

సినిమా అంతా పూర్తిగా వైజాగ్ నేప‌థ్యంలో ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌త్యేకంగా వింటేజ్ సెట్స్ ని హైద‌రాబాద్ లో నిర్మిస్తున్నారు. ఓవైపు షూటింగ్ చేస్తూనే మ‌రోవైపు కొత్త సెట్ల నిర్మాణం చేప‌డుతున్నారు. క‌థ ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కూ సెట్ లోనే ఉండ‌టంతో సినిమాకి ఈ సెట్లే ఎంతో కీల‌కంగా తెలు స్తోంది. ఔట్ డోర్ స‌న్నివేశాలు చాలా రేర్ గా ఉన్నాయి. ఇప్ప‌టికే 60-80 కాలం నాటి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తూ ప్ర‌త్యేక‌మైన సెట్లు వేసి కొంత షూటింగ్ పూర్తి చేసారు.

తాజాగా సినిమాకి సంబంధించిన మ‌రో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. పాత విశాఖ‌ప‌ట్ణ‌ణం ప్ర‌తిబిం బించేలో మ‌రో సెట్ నిర్మాణం చేప‌డుతున్నారుట‌. ఈ సెట్ కోసం 15 కోట్ల‌కు పైగా వెచ్చించారుట‌. ఈ సెట్ పూర్తియ‌న వెంట‌నే 35 రోజుల పాటు ఏక‌ధాటిగా ఆ సెట్ లో నే షూటింగ్ ఉంటుంద‌ని స‌మాచారం. ఇందులో కీల‌కమైన స‌న్నివేశాల‌తో పాటు, కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాలు కూడా చిత్రీక‌రించ‌నున్నారుట‌.

ముందుగా కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ ద్వారా డిజైన్ చేసుకుని..డిజిటల్ మ్యాట్ ఇత‌ర పెయింటింగ్స్ ద్వారా ఫైన‌ల్ అయిన త‌ర్వాత నిర్మాణం చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో వ‌రుణ్ తేజ్ ఏకంగా 4 విభిన్న‌మైన గెట‌ప్స్ లో క‌నిపించ‌నున్నాడు. వాటి ఆహార్యం చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంద‌ని తెలుస్తుం ది. అప్ప‌టి మ‌నుషులు ఎలా ఉండేవారు? ఎంత మాసివ్ గా ఉండేవారు? అన్న‌ది సినిమాలో హైలైట్ చేయ‌బోతున్నారు. ఇందులో హీరోయిన్ల‌గా మీనాక్షి చౌద‌రి, నోరా ప‌టేహీ న‌టిస్తున్నారు. విజేంద‌ర్ రెడ్డి- ర‌జ‌నీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.