బహుశా ప్రభాస్ కలలోనైనా తాను అలాంటి మాట వినాల్సి వస్తుందని అనుకోని ఉండడు. అనుకోని, ఊహించనవి జరగడమే కదా జీవితం అంటే. అయితే ప్రభాస్‌ను ఆ హీరోయిన్ అనరాని మాట అన్నదా అంటే అనలేదనే సమాధానం వస్తుంది. మరెందుకు అంత ఆశ్చర్యం అని ప్రశ్నిస్తారా? అంతేనండి…కొన్ని పిలుపులు కొందరి నుంచి రాకూడదు. అంతే తప్ప, ఆ పిలుపులు మంచివా, చెడ్డవా అనే చర్చ కాదక్కడ. అసలు ఏం జరిగిందంటే…
దీనికంతటికి హీరోయిన్ అనుష్కే కేంద్ర బిందువు. హీరోయిన్ అనుష్క తాజా చిత్రం `నిశ్శబ్దం`. `భాగమతి` తర్వాత బాగా గ్యాప్ తీసుకుని మరీ…తీస్తున్న చిత్రమిది. ప్రస్తుతానికైతే ఏప్రిల్ 2న `నిశ్శబ్దం` చిత్రం విడుదల చేయాలని చిత్ర యూనిట్ గట్టి పట్టుదలతో ఉంది. కరోనా ఎఫెక్ట్ లేకపోతే…అనుకున్నది అనుకున్నట్టు విడుదలయ్యే అవకాశాలున్నాయి.
కాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు అనుష్క హాజరవుతోంది. అలాంటి ఓ కార్యక్రమానికి యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వేదికపైకి అనుష్క వెళ్లింది.
ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ఫోటోను అనుష్కకు సుమ చూపించింది. ఆ ఫొటోను చూసిన వెంటనే అనుష్క ఉత్సాహం చూపుతూ…అతను నా కొడుకు అని అనేసింది. దీంతో సుమ ఖంగుతింది. సరే.. కొడుకు కాదు.. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పమని సుమ రెట్టించి అడిగింది. అందుకే కదా ఈయన నాకు కొడుకు అయ్యాడంటూ అనుష్కతనదైన శైలిలో అదరగొట్టే పంచ్ విసిరింది.
ప్రభాస్‌తో రిలేషన్ గురించి అనుష్క చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అనుష్క పంచ్‌పై నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు విసురుతున్నారు. ఓ మై గాడ్…అనుష్క నోట ప్రభాస్ ఆ మాట వినాల్సి రావడమా? అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.