కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న జగన్…!!

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సమరం మోగింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ పట్టు నిలుపుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, ఎన్నికలు అంటే మద్యం, డబ్బు వరదలా మారుతుంది. కానీ, ఈ మున్సిపాలిటీ పంచాయతీ ఎన్నికల్లో ఇకపై అలా కుదరదు. ఎందుకంటే, ఈ ఎన్నికలను డబ్బు, మద్యం పంచకుండా చూసేలా చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టాలను తెరమీదకు తీసుకొచ్చారు.

కొత్త చట్టాలు తెరమీదకు తీసుకురావడంతో అన్ని పార్టీలకు భయం పట్టుకుంది. చాటుమాటుగా డబ్బు పంచినా గెలిచిన తరువాత ఈ విషయం తెలిస్తే అరెస్ట్ కావడం ఖాయం. డబ్బు పంచకుండా ఒకవేళ విజయం సాధించినా వైకాపా పార్టీ కక్షసాధిస్తుంది. ఏదోలా ప్రతిపక్షాన్ని ఇబ్బందుల్లోకి నెట్టి పదవులను లాక్కుంటుంది. ఇలాంటప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి పక్కకు తప్పుకుంటున్నారు.

ముఖ్యంగా జేసి వర్గీయులు అనంతపురం జిల్లాలో ఎన్నికలకు దూరంగా ఉండటమే మంచిది అనే భావనలో ఉన్నారట. వైఎస్ జగన్ ఈ వర్గీయుల మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. గత కొన్ని రోజులుగా పాపం జేసిని అతని అనుచరులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల నుంచి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అని పట్టుబడుతున్నారని తెలుస్తోంది.

డబ్బు పంచుకున్నా ప్రజలు తమకే ఓటు వేస్తారనే ఆలోచనలో బాబు ఉన్నారని జేసి అంటున్నారు. డబ్బు పంచినా పంచుకున్నా జగనే గెలుస్తారని జేసి అంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా జగన్ కు సపోర్ట్ గా మాట్లాడటం ఏంటి అంటే… అదంతే అయన అలానే మాట్లాడతారు. ఏది లోపల ఉంచుకోరు అని చెప్తున్నారు జేసి వర్గీయులు. స్థానిక ఎన్నికలు రసవత్తరంగా సాగుతాయో లేదంటే ఏక పక్షంగా సాగుతాయో తెలియాలంటే ఈనెలాఖరు వరకు ఆగాల్సిందే.