కల్కి 2898 ఏడీ – ఆ ఆరుగురు చాలా స్పెషల్ గురు

ఎట్టకేలకు ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గురువారం నాడు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంటోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయటానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ లో కల్కి మూడు మిలియన్స్ కు పైగా డాలర్లు అందుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ ప్రభాస్ నిలిచాడు. అలాగే ఇందులోని ఇతర నటీనటులు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. సినిమాలో నటించిన ప్రముఖ హీరోయిన్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుమైటీ అలియాస్ సుమతి పాత్రలో దీపికా పదుకొనే ఆకట్టుకుంది. ఆమె ప్రదర్శన ప్రేక్షకుల మనసు దోచుకుంది. దీపికా పాత్రలో ఉన్న భావోద్వేగాలు, సానుభూతి ప్రతీక్షణంలో కనబడుతాయి.

అలాగే మలయాళ బ్యూటీ అన్నా బెన్ మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కైరాగా కనిపించిన ఆమె పాత్ర సస్పెన్స్ తో నిండి ఉంది. కైరా పాత్రలో అన్నా బెన్ మంచి డ్రామా తో పాటు, శక్తివంతమైన ప్రదర్శనను అందించింది. ఇక మాళవిక నాయర్, ఉత్తర అనే పాత్రలో కనిపించింది. ఆమె పాత్ర సినిమాకు కొత్తదనం తీసుకువచ్చింది. ఉత్తర పాత్రలో మాళవిక నాయర్ ఎమోషనల్ కంటెంట్ ను ప్రదర్శించడం చూసిన ప్రేక్షకులు మెచ్చుకున్నారు.

అలాగె రాక్సీ పాత్రలో దిశా పటాని ప్రభాస్ తో రొమాంటిక్ ఎపిసోడ్స్ లో కనిపించింది. ఆమె పాత్ర చిన్నదైనా, ప్రభాస్ తో ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. అంతే కాకుండా సీనియర్ నటీమణి శోభన మరియం పాత్రలో కనిపించి, తన సహజ నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. శోభన పాత్రలో ఉన్న పరిణితి సినిమాకు బలాన్నిచ్చాయి. అలాగే జాతి రత్నాలు అల్లరి హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, ఈ సినిమాలో ఒక చిన్న పాటలో మెరిసి మాయమైంది. ఆమె పాత్ర చిన్నదైనా, ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక బుజ్జి అనే కారుకు కీర్తి సురేష్ వాయిస్ అందించడం విశేషం. ఈ పాత్రకు కీర్తి వాయిస్ మరో ప్రత్యేకతగా నిలిచింది. మొత్తానికి, ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఆరుగురు ప్రధాన హీరోయిన్లు తమ టాలెంత్ తో ప్రేక్షకులను మెప్పించారు. ప్రభాస్ తో పాటు వీరి ప్రదర్శన కూడా సినిమాను మరింత బలపరిచింది. సినిమాలోని ప్రతీ నటీనటుడు, పాత్ర సినిమాను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. ఇక బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్ లో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ లెక్క ఎంతవరకు వెళుతుందో చూడాలి.