కూతురు మాటలతో ముద్దులతో రెచ్చిపోనున్నారా?

ఎంత నటీమణులైనా పెళ్లైన తర్వాత కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం కనిపిస్తుంది. టాలీవుడ్ తో పోలిస్తే బాలీవుడ్ లో ఇంటిమేటెడ్ సీన్ల జోరు చాలా ఎక్కువే. తెర మీద బోల్డ్ సీన్లు చేసేందుకు హీరోహీరోయిన్లు చెలరేగిపోతుంటారు. అలాంటి వారు సైతం పెళ్లైతే మాత్రం.. కొన్ని పరిమితులు పుట్టుకోవటం కనిపిస్తుంది. హిమేశ్ రేష్మియానే తీసుకుంటే.. అతడి సినిమా అంటే.. హీరోయిన్ ఎవరైనా సరే కిస్సింగ్ సీన్లు ఉండాల్సిందే. తర్వాతి కాలంలో వాటికి దూరంగా ఉండటం తెలిసిందే. అలాంటి వారు ఎందరో.

పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లైన తర్వాత నుంచి బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్.. బ్యూటీ బెబో అదేనండి కరీనా కపూర్ లు ముద్దు సీన్లు లాంటి వాటికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలో సిట్యువేషన్ డిమాండ్ చేసినప్పటికి ముద్దు సీన్లకు దూరంగా ఉండటం తెలిసిందే. అలాంటిది వారిద్దరూ తాజాగా మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం.. విచిత్రంగా సైఫ్ కుమార్తె సారా అలీఖాన్ గా చెబుతున్నారు. గురువారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లో పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో.. రీల్ కు రియల్ కు మధ్యనున్న తేడాను విప్పి చెప్పిందట.

సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు ఆర్టిస్టులు తెర మీద కనిపించే పాత్రకు తగ్గట్లు చేయాలే తప్పించి.. పరిమితులు పెట్టుకోవటం సరికాదన్న హితబోధ చేసినట్లు చెబుతున్నారు. ముద్దుసీన్లు చేస్తే తప్పేంటి? నాకు తెలిసి అది పొరపాటు కాదన్న ఆమె.. తన మాటలు సిల్లీగా అనిపించొచ్చు కానీ తాను కానీ వారి స్థానంలో ఉంటే మాత్రం పరిమితులు పెట్టుకోనని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. వ్యక్తిగత జీవితం.. ప్రొఫెషన్ ఒకటి కాదని స్పష్టం చేయటం.. కూతురు మాటకు తండ్రి కన్వీన్స్ అయినట్లుగా చెబుతున్నారు. కూతురు చెప్పిన మాటల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారంటే రానున్న రోజుల్లో సైఫ్ ఆలీఖాన్.. కరీనాలు తాము చేసే సినిమాల్లో ముద్దు సీన్లు.. ఇంటిమేటెడ్ సీన్లకు గతంలో మాదిరి పరిమితులు పెట్టుకోరన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.