కేటీఆర్ ను ‘ఇడియట్‌’ అంటూ దూషించిన ఖేమ్‌ చంద్ర

తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిగా పేరున్న కేటీఆర్‌ను బీజేపీ అధికార ప్రతినిథి ఖేమ్‌ చంద్‌ శర్మ ఇడియట్‌ అంటూ దూషించాడు. టీకా విషయంలో అవగాహణ రాహిత్యంతో మాట్లాడటంతో పాటు అసత్య ప్రచారం చేస్తున్న కేటీఆర్‌ తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. తాజాగా కేటీఆర్ ట్విట్టర్‌ లో లెట్స్ టాక్ వ్యాక్సినేషన్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్బంగా ఆయన కేంద్రం వ్యాక్సినేషన్‌ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తుందని ఆలస్యం చేస్తుందంటూ కేటీఆర్ ఆరోపించాడు.

కేటీఆర్ వ్యాఖ్యలను ఖేమ్‌ చంద్‌ సోషల్‌ మీడియా ద్వారా ఖండించాడు. యూ ఇడియట్‌ ప్రజల్లో అసత్యాలు ప్రచారం చేస్తావా.. ఇప్పటికే 17.5 కోట్ల మందికి మొదటి డోసు ఇచ్చి ప్రపంచంలోనే ముందంజలో ఉన్నాం. మొత్తంగా ఇప్పటి వరకు 22 కోట్ల డోసులను ఇచ్చాం అంటూ ట్వీట్‌ చేశాడు. ఖేమ్‌ చంద్‌ ట్వీట్‌ కు కేటీఆర్ కూడా స్పందించాడు. మీలా మేము మాట్లాడగలం. కాని మా సంస్కృతిలో అలా లేదు. పలు దేశాల జనాబాలతో పోల్చితే 50.. 60 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి అయ్యింది. మరి ఇక్కడ ఎంత శాతం వ్యాక్సినేషన్‌ ఇచ్చారో చెప్పాలి. వాస్తవాలను జీర్ణించుకోలేని మీలాంటి వారికి నిజాలు ఇలా కఠినంగానే ఉంటాయని కేటీఆర్‌ చురకలు అంటించాడు.