సిద్ధు జొన్నలగడ్డ.. ఈ పేరు కంటే డీజే టిల్లు అంటే చాలా తొందరగా గుర్తుపడతారేమో. గుంటూరు టాకీస్ సినిమా తో హీరోగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన సిద్ధుకి డీజే టిల్లు తో మంచి హిట్ లభించింది. అంతక ముందు కృష్ణ విత్ హిస్ లీల వంటి సినిమాలు తీయగా అది డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైంది. సినిమా పాజిటివ్ టాక్ వచ్చినా అతని ని ఎక్కువగా గుర్తించింది మాత్రం టిల్లు గానే.
ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. దీంతో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరూ టిల్లు కి ఫ్యాన్స్ అయిపోయారు. ముఖ్యంగా మూవీ లో స్టోరీ కన్నా సిద్ధు డైలాగులు చెప్పే విధానానికే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు అనుకోవచ్చు. ఇప్పటికీ ఈ మూవీ లోని డైలాగ్స్ అందరూ వాడుతూ ఉంటారు.
కాగా ఇదే హుషారు లో ఈ మూవీకి సీక్వెన్స్ మొదలుపెట్టాడు. టిల్లూ స్వ్కేర్ పేరిట తెరకెక్కిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని లో సిద్ధు సరసన అనుపమ నటిస్తోంది. ఇది కూడా పక్కా హిట్ అవుతుందని అందరూ నమ్ముతున్నారు. నిజంగా ఇది కూడా హిట్ అయితే సిద్ధు కెరీర్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం అని భావిస్తున్నారు.
అయితే ఇంత మంచిగా కెరీర్ సాగుతున్న సమయంలో సిద్ధూ రాంగ్ స్టెప్ వేస్తున్నాడనే భావన కలుగుతోంది. తాను ఎంచుకునే సినిమాలు నిజంగా అతని కెరీర్ కి ఉపయోగపడతాయా అనే సందేహం కలుగుతోంది. ప్రముఖ స్టైలిష్ స్క్రీన్ రైటర్ కోన వెంకట్ సోదరి నీరజ కోన తొలిసారి డైరెక్టర్ గా మారుతున్నారు. ఆమె సినిమా లో సిద్ధు హీరో గా నటిస్తున్నారు. అసలు దర్శకత్వం మీద అవగాహన లేని ఆమెతో సినిమా అంగీకరించి సిద్ధు తప్పు చేశాడా అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది దర్శకులు తొలి సినిమా తో సత్తా చాటినవారు ఉన్నారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని ఉంటాడులే అని అనుకుందాం.
మరో సినిమా సమంత హీరోయిన్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినమాలో నూ సిద్ధూ హీరో గా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. సమంత హీరోయిన్ అంటే కథ మొత్తం ఆమె చుట్టూ తిరగడం ఖాయం. అలాంటి కథ లో నటిస్తే సిద్ధు కెరీర్ కి పెద్దగా ఉపయోగపడదేమో అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
మరోవైపు చిరంజీవి హీరో గా సోగ్గాడే చిన్నినాయన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నూ సిద్ధూ నటిస్తున్నాడట. చిరంజీవి సినిమా లో పాత్ర దక్కడం అంటే అదృష్టం కావచ్చు. కానీ పెద్దగా స్కోప్ నిడివి ఉండే పాత్ర దొరకడం కష్టం కదా అనే వాదన ఎక్కువగా ఉంది.
ఆ మూవీ క్లిక్ అయినా క్రెడిట్ చిరు ఖాతా లోకి పోతుంది కదా. ఇవన్నీ ఆలోచించకుండా సిద్ధు ఇలాంటి సినిమాలు ఎందుకు ఎంచుకుంటున్నాడు అని ఆయన ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. మరి ఆయన ఆలోచన ఎలా ఉందో మనకు తెలీదు కదా. ఆయన కెరీర్ మాత్రం బాగుండాలని కోరుకుందాం.