క్రేజీ రియాలిటీ షో నుంచి త‌ల్లీకూతుళ్లు ఔట్!

ప్ర‌ముఖ స‌హాయ‌న‌టి సురేఖావాణి ఆమె కుమార్తె సుప్రీత బిగ్ బాస్ హౌస్‌లో చేరే అవకాశం ఉందని ఇటీవ‌ల క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. సోష‌ల్ మీడియాల్లో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న ఈ త‌ల్లీ కూతుళ్లు బిగ్ బాస్ షోని రంజింప‌జేస్తార‌ని అంతా భావించారు. కానీ ఇంత‌లోనే ఊహించ‌ని మ‌లుపు. తాజా స‌మాచారం మేర‌కు.. ఈ జోడీ బిగ్ బాస్ ఇంట్లో ప్ర‌వేశించ‌కూడ‌ద‌ని భావించిన‌ట్టు తెలిసింది.

తమకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందన్న వాస్తవాన్ని వారు కొట్టిపారేసినప్పటికీ, హౌస్‌లోకి ప్రవేశించిన తర్వాత తమకు ఎలాంటి ఇమేజ్ వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. ఈ రియాలిటీ షో చేసిన తర్వాత సెలబ్రెటీల చుట్టూ నెగిటివిటీ వేగంగా షేర్ అవుతుంది. అందుకే ఇలాంటి షో నుంచి దూరంగా ఉండాల‌ నిర్ణయించుకున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

నిజానికి యాంక‌ర్ల‌లో శ్రీ‌ముఖి బిగ్ బాస్ షోలో పాల్గొంది. త‌న‌తో పాటే ప‌లువురు యాంక‌ర్లు బిగ్ బాస్ ఇంట్లో సంద‌డి చేసారు. కానీ సీనియ‌ర్ యాంక‌ర్ ఉదయభాను #బిగ్ బాస్ 6 హౌస్‌లో చేరాల్సి ఉంది. కానీ ఉద‌య‌భాను చివ‌రి నిమిషంలో రియాలిటీ షో నుండి వైదొలిగింది. ఈ వారాంతంలోనే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు రియాలిటీ షో #బిగ్ బాస్ 7 గ్రాండ్ లాంచ్‌కు సిద్ధమవుతోంది. ఇప్ప‌టికే ఇంటి స‌భ్యులు ఖ‌రారయ్యారు.

పోటీ షురూ అయింది. చివ‌రి నిమిషంలో ఎగ్జిట్ ల గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇప్పుడు సురేఖ‌వాణి- సుప్రీత జోడీ ఈ షో నుంచి వైదొలిగార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక సురేఖావాణి సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, కుమార్తె సుప్రీత న‌టీమ‌ణిగా పెద్ద తెర అవ‌కాశాల కోసం త‌న వంతు ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని తెలిసింది.