గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. నెక్స్ట్ రాబోయే గేమ్ ఛేంజర్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో కానీ ఆ తర్వాత సినిమాలు మాత్రం చాలా క్రేజీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కంప్లీట్ కొత్త తరహా కాన్సెప్ట్ లతోనే రామ్ చరణ్ భవిష్యత్తు ప్రాజెక్టులు తెరపైకి రాబోతున్నట్లుగా అర్థమవుతుంది.
ఆ తర్వాత వెంటనే బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16 సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్ గా లాంచ్ చేశారు ఏఆర్ రెహమాన్ సంగీతం – జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అవ్వడంతో ఈ సినిమా నార్త్ ఇండియాలో కూడా చాలా అట్రాక్షన్ క్రియేట్ చేసింది. ఇక మరొకవైపు రామ్ చరణ్ తేజ్ మరో ప్రాజెక్టును కూడా ఇదే ఏడాది స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.
ముందుగా అతను బుచ్చిబాబు ప్రాజెక్టుకు ఒక టైమ్ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత రామ్ చరణ్ తేజ్ తన 17వ సినిమాను సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ గురు శిష్యుల మధ్యలోనే రామ్ చరణ్ తన వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది.
సుకుమార్ ఈ ఏడాది చివరిలోనే రామ్ చరణ్ ప్రాజెక్టును కూడా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ఇప్పటికే పుష్ప సెకండ్ పార్ట్ కోసం చాలా టైమ్ తీసుకున్న సుకుమార్ తరువాత ప్రాజెక్టును మాత్రం వెంటనే మొదలుపెట్టాలి అని ఆలోచనతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సుకుమార్ ఎంత టైమ్ తీసుకుంటాడో అతని శిష్యుడు కూడా మేకింగ్ విషయంలో అంతే టైం తీసుకుంటాడు.
కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్ 16వ సినిమా ఈ ఏడాది చివరిలోపు ఫినిష్ అవుతుందా లేదా అన్నది అసలు ప్రశ్న. ఒకవేళ చివరి దశలో ఉంటే సుకుమార్ కు కాస్త హెల్ప్ అవుతుంది అని చెప్పవచ్చు. ముందుగా ప్రాజెక్టును లాంచ్ చేసి ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులను కాస్త స్లోగా చేసుకున్నా ఆలోపు బుచ్చిబాబు సినిమా ఫినిష్ అవుతుంది.
ఇక సుకుమార్ ఒకవేళ ఇదే ఎడాది చివరలో అనుకున్న ప్లాన్ ప్రకారం రామ్ చరణ్ ప్రాజెక్టు మొదలుపెడితే. అది ఫినిష్ కావడానికి కనీసం ఏడాదిన్నర సమయం అయితే పడుతుంది. ఇక ఆ ప్రాజెక్టు 2026లోనే థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి రామ్ చరణ్ ఈ గురు శిష్యుల ప్రాజెక్టులను ఎంత త్వరగా పూర్తి చేస్తాడో చూడాలి. అలాగే రామ్ చరణ్ భవిష్యత్తులో లోకేష్ కనగరాజ్, ప్రశాంత్ నీల్ లాంటి దర్శకులతో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.