వివాహం జరిగిన సుమారు 10 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ దంపతులు ఇప్పుడు తల్లిదండ్రులకు కాబోతున్నారు. ఈ మధ్యలో వీరి సంతానం గురించి జరగని ప్రచారం అంటూ లేదు మధ్యలోనే వీరికి విడాకులు కూడా ఇప్పించే ప్రయత్నం కూడా చేసేసారు. సోషల్ మీడియాలోని కొందరు ప్రబుద్ధులు ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ ఉపాసన తమకు పుట్టబోయే బిడ్డ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న రాంచరణ్ ప్రస్తుతానికి గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ ప్రారంభించాల్సి ఉంది. అయితే తన భార్య గర్భవతిగా ఉన్న టైంలో రామ్ చరణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
అదేంటంటే రెండు నెలలపాటు ఆయన ప్యాటర్నిటీ లీవ్ తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఈ ప్యాటర్నిటీ లీవ్ అనేది కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకు ఇస్తూ ఉంటారు.
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె డెలివరీ సమయంలో భర్త అన్ని దగ్గరుండి చూసుకునేందుకు జీవితం ఇస్తూనే ఈ లీవ్ ఇస్తూ ఉంటారు పలు సంస్థల అధినేతలు. రామ్ చరణ్ కి రామ్ చరణ్ ఏ బాస్ కాబట్టి ఆయన సుమారు రెండు నెలల పాటు ఈ లీవ్ తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.
తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు రామ్ చరణ్ జులై ఆగస్టు నెలలో పూర్తిగా తన కుటుంబం కోసం తన భార్యతోనే గడపాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డతో కూడా కొంత సమయం గడిపేందుకు ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇక సెప్టెంబర్ నెల నుంచి బుచ్చిబాబు సినిమా షూటింగ్లో చరణ్ పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరోపక్క ఆయన ఇద్దరు సినిమాల స్క్రిప్టులు కూడా వింటున్నారు.