చాంబర్ అయితే ఏంటీ..ఆర్ఆర్ఆర్ ఇక్కడ

కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా చూడడానికి ప్రభుత్వాల పరంగా, సంస్థల పరంగా, వ్యక్తుల పరంగా ఎవరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. ఈ మేరకు హైదరాబాద్ కార్పొషన్ ఏకంగా పెళ్లిళ్లు, పేరంటాల మీద కూడా ఆంక్షలు విధించింది. మాల్స్, స్కూల్స్ మూసేయమంది.థియేటర్ లు బంద్ పెట్టింది. ఈ క్రమంలోనే నిర్మాతల మండలి, నటుల సంఘం ఇలా అందరూ కలిసి షూటింగ్ లు కూడా బంద్ చేయాలని నిర్ణయించారు.

మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా షూటింగ్ నిలిపేసారు. దానిని మిగిలిన వారు ఫాలో అయ్యారు. సమ్మర్ విడుదల కు సిద్దమవుతున్న చాలా సినిమాలు వున్నాయి. వాటికి ప్యాచ్ వర్క్ లు, పాటలు బకాయి వున్నాయి. కొన్ని సెట్ లు వేసి రెడీగా వున్నాయి. అయినా నిలిపివేసారు. వీటివల్ల సినిమాల విడుదలే అనుమానంలో పడుతుంది.

కానీ ఎప్పుడో సంక్రాంతికి విడుదల పెట్టుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా మాతం చాలా సైలంట్ గా అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరిపేసుకుంటోంది. చాంబర్ నిర్ణయాలు, ప్రభుత్వ సూచనలు తనకు అనవసరం తన సినిమా తనది, తన షూటింగ్ షెడ్యూలు తనది అంటూ దర్ళకుడు రాజమౌళి మొండిగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి కావడంతో ఎన్టీఆర్, చరణ్ కూడా ఏమీ కాదనలేక షూటింగ్ కు వెళ్తున్నారని బోగట్టా.

మెగాస్టార్ సినిమా, తను నిర్మాతగా వున్న సినిమా షూట్ ను క్యాన్సిల్ కొట్టిన రామ్ చరణ్ ఈ ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరో. ఆయన కూడా రాజమౌళి ఆదేశాలకు తలొగ్గినట్లు తెలుస్తోంది. రాజమౌళి అయితే ప్రభుత్వ సూచనలు, చాంబర్, మండలి, మా లాంటి సంస్థల నిర్ణయాలు వర్తించవా అన్న ఆఫ్ ది రికార్డు కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

మరి సిఎమ్ కేసిఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో?