మెగాస్టార్ చిరంజీవి..నటసింహ బాలకృష్ణని ఒకే ప్రేమ్ లో చూసే సమయం ఆసన్నమైందా? అందుకు ఇద్దరు సై అంటారా? అంటో నో డౌట్ అనే అనాలి. ఎందుకంటే బాలయ్య ఓ ఇంటర్వ్యూ సాక్షిగానే చిరంజీవితో సినిమా చేస్తారా? అంటే తప్పకుండా ఎందుకు చేయను. నటులంటే అందరితో కలిసి జర్నీ చేయాలి కదా అన్నారు. దీంతో బాలయ్య సైడ్ నుంచి ఎలాంటి అడ్డంకి లేదని తేలిపోయింది. చిరంజీవితో నటించడాని సింహం సిద్దంగానే ఉందని తెలిపోయింది.
ఇక మెగాస్టార్ స్వభావం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంతవరకూ చిరంజీవి మల్టీస్టారర్ చిత్రాలు చేసింది లేదు. ఆయన సినిమాల్లో చాలా మంది పేరున్న నటులు భాగమయ్యారు తప్ప ఆయన ఇమేజ్ ని ఏ నటుడు మ్యాచ్ చేయలేదు. ఆ స్థాయి టాలీవుడ్ లో కొందరి హీరోలకు మాత్రమే ఉంది. అందులో నటసింహం సరిసమానుడు. చిరు..నాగార్జున ..వెంకటేష్..బాలయ్యని అభిమానులంతా ఒక తరం హీరోలుగా చూస్తారు.
ఆ ముగ్గురు అభిమానుల దృష్టిలో సమానం. ఆరకంగా ఇక్కడ ఒకరు ఎక్కువ? ఒకరు తక్కువ అనడానికి లేదు. ఆ జనరేషన్ హీరోల్లో ఒకప్పుడు ముగ్గురి మధ్య ఎలాంటి పోటీ ఉండేదో తెలిసిందే. అభిమానుల మధ్య వైరాలు సైతం అలాగే కొనసాగేవి. అయితే ఇప్పుడు మల్టీస్టారర్ హవా కొనసాగుతుంది. హీరోలంతా కలిసి నటించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒకరి వేడుకలకు ఒకరు సహకరించు కుంటున్నారు. ఇలా ఎంతో గొప్ప ఆరోగ్యకరమైన వాతావరణం పరిశ్రమలో ఉంది.
ఈ నేపథ్యంలో చిరంజీవి-బాలకృష్ణ కాంబినేషన్ సెట్ అవ్వడం పెద్ద పనేం కాదని చెప్పొచ్చు. అయితే ఆ దైర్యం ఏ దర్శకుడు చేస్తాడు? అన్నది ముఖ్యం. ఇది మాత్రాం దర్శకుడి ఎవరైనా వారికి సవాల్. ఇద్దరు పెద్దస్టార్లని ఒకే ప్రేమ్ లో చూపించాలి. ఇద్దర్నీ బ్యాలెన్స్ చేసి చూపించడం అంటే కత్తిమీద సాములాంటింది. కథ సహా అందులో ఇద్దరి పాత్రలు చాలా బ్యాలెన్స్ గా ఉండాలి. మరి అంతటి సాహసానికి ఏ దర్శకుడు పూనుకుంటాడో చూద్దాం. 2024 లో ఇది సాధ్యమవ్వాలని ఆశిద్దాం.