చైనా టాయిలెట్ కు ట్రంప్ కార్డ్

trumpట్రంప్ కార్డ్ . పేకాటలో అదృష్టాన్ని తెచ్చిపెట్టే కార్డును ఇలా పిలుస్తారు. ఇప్పుడు చైనా టాయిలెట్ బిజినెస్ మేన్ కూడా ట్రంప్ జపమే చేస్తున్నారు. ట్రంప్ పేరు చెప్పి నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. అదేంటి. అవును మీరు చదువుతుంది నిజమే. ట్రంప్ కార్డ్ లాగే.. ట్రంప్ టాయిలెట్స్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పదేపదే చైనాను టార్గెట్ చేశారు. కానీ చైనా టాయిలెట్ కంపెనీలు మాత్రం ట్రంప్ ను ఎప్పుడో టార్గెట్ చేసాయి. చైనాలో 2000వ సంవత్సరం నుంచి ట్రంప్ టాయిలెట్స్ కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడయ్యాక గిరాకీ ఇంకా పెరిగింది.

చైనాను తీవ్రంగా విమర్శిస్తున్న ట్రంప్ ను.. తమ టాయిలెట్ పేపర్ గా వాడటానికి చైనీయులు ఉత్సాహం చూపిస్తున్నారు. దీంతో ట్రంప్ కార్డ్ కోసం చైనా కంపెనీలు పోటీపడుతున్నాయి. ట్రంప్ ట్రేడ్ మార్క్ కోసం కోట్లు ఖర్చుపెడుతున్నాయి. బిజినెస్ బాగుండాలంటే ఆమాత్రం కష్టాలు తప్పవంటున్నారు అక్కడ వ్యాపారులు.

ఎవరైనా మనల్ని తీవ్రంగా ద్వేషిస్తే.. వారిని ద్వేషించాలి. కానీ ట్రంప్ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతోంది. అందరిపై విద్వేషాన్ని వెళ్లగక్కిన ట్రంప్ ను అమెరికన్లు ప్రేమించారు. ఇప్పుడు తమను తీవ్రంగా విమర్శిస్తున్న ట్రంప్ కోసం.. చైనా కంపెనీలు క్యూ కడుతున్నాయి. ట్రంప్ జాతకం చూస్తుంటే.. అంతా రివర్స్ లో ఉన్నట్లు కనిపిస్తోంది.