చైనా ప్రొడక్షన్స్‌.. ఇంకో కొత్త ‘వైరస్‌’ దూసుకొస్తోంది.!

చైనా, ప్రపంచానికి పెను వినాశకారిగా మారుతోంది. ఇప్పటికే చైనా నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌, ప్రపంచాన్ని వణికిస్తోన్న విషయం విదితమే. చైనాలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టగా, ప్రపంచం ఈ వైరస్‌ దెబ్బకి విలవిల్లాడుతోంది. వందలాది మంది వేలాది మంది ఈ వైరస్‌ దెబ్బకి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమయంలో మరో భయంకరమైన వార్త వెలుగు చూసింది. ఇది కూడా చైనా పాపమే.

తాజాగా చైనాలో హంటా వైరస్‌ వెలుగు చూసింది. ఇది ఎలుకల్లో పుట్టుకొచ్చే వైరస్‌. చైనాలో ఎలుకల్ని తినడం సర్వసాధారణమే. అలా ఎలుకల్ని తినేవారిలోకి ఈ వైరస్‌ ప్రవేశిస్తుంది. ఇప్పటికే పలువురు హంటా వైరస్‌ బారిన పడినట్లు తెలుస్తోంది. బతికి వున్న ఎలుకల్ని సాస్‌లో ముంచుకుని, మద్యం సేవిస్తూ తినడం చైనాలో ఓ సరదా అలవాటుగా మారిపోయింది. అలవాటు కాదు, అదొక వ్యసనం అంటున్నారు చాలామంది.

ఇప్పటికే కరైనా వైరస్‌ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక సతమతమవుతోంది మానవాళి. ఇప్పుడీ హంటా వైరస్‌ కూడా ప్రబలితే పరిస్థితి ఏంటి.? ఇది చైనాకి సంబంధించిన సమస్య కాదు.. ప్రపంచానికి సంబంధించిన సమస్య. మొత్తంగా చైనాని, ప్రపంచం దూరం పెడితే తప్ప ఈ తరహా వైరస్‌లకు అడ్డుకట్ట వేసే పరిస్థితి వుండదేమో.!

ఇదిలా వుంటే, చైనా అత్యంత వ్యూహాత్మకంగానే ఈ తరహా వైరస్‌లను సృష్టించి, వాటి తీవ్రతను పెంచుతోందన్న చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ చైనాలో అందుబాటులో వుందనీ, అయితే అది మిత్ర దేశాలకు కూడా తెలియకుండా జాగ్రత్త పడుతోందనీ అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చైనా దెబ్బకి, ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది.