జగన్‌, కేసీఆర్, షర్మిల బిజినెస్‌ రాజకీయం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరియు షర్మిల విషయంలో తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. రెండు రాష్ట్రాలను దోచుకునేందుకు ఈ ముగ్గురు నాటకాలు ఆడుతున్నారంటూ ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్న వీరు ఇలాంటి సమయంలో మాత్రం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నట్లుగా కలరింగ్‌ ఇస్తున్నారు.

కేసీఆర్ మరియు జగన్ అన్ని విషయాల్లో ఒక్కటే. వారిద్దరు ప్రతి విషయంలో కూడా కలిసి డ్రామాలు ఆడుతున్నారు. జగన్ ఆస్తులు మరియు పెట్టుబడులు హైదరాబాద్‌ లో ఉన్నాయి. కేసీఆర్‌ కు జగన్ సరెండర్ కాకుంటే వాటిపై ప్రభావం ఉంటుంది.. అందుకే సరెండర్ అయ్యాడు. ఆ విషయం ప్రజలకు అర్థం అవుతుందని ఈ సందర్బంగా ఆయన అన్నారు. కేసీఆర్‌ నీటి వాటాల కోసం సవాల్‌ చేస్తుంటే జగన్ మాత్రం సైలెంట్‌ గా ఉన్నాడు అంటూ విమర్శలు వ్యక్తం చేశాడు. తాము ప్రజా సమస్యలపై ఉద్యమం చేస్తుంటే అరెస్ట్‌ లు చేస్తున్నారని ఆరోపించారు.