నిజం గడప దాటే సరికి, అబద్ధం లోకం తిరిగి వస్తుందట. అంటే అబద్ధానికి ఉన్న ఆకర్షణ అలాంటిదన్నమాట. నెగటివ్ అంశాలపై ఉన్న శ్రద్ధాసక్తులు…ఎందుకనో పాజిటివ్‌పై అసలే ఉండవు. మరీ ముఖ్యంగా కొందరు పోకరీ వెధవలు ప్రముఖల పేర్లతో చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతాయనే ఉద్దేశంతో ‘ఛీప్ ట్రిక్స్’కు పాల్పడుతున్నారు.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరుతో సినిమా రంగం సహా ప్రముఖులు నివసించే జూబ్లీహిల్స్‌పై దుష్ప్రచారం జరుగుతోంది. ‘స్కాట్లాండ్కి చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంట్లో ఆ వ్యక్తి ఉంటున్నాడు. ప్రజలు అతని అచూకీ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జూబ్లీహిల్స్‌లోని పబ్లిక్స్ ప్లేసులకు వెళ్లకండి’ అనే మెసేజ్ ఒకటి యాక్టర్స్ అనానిమస్ అనే గ్రూపులో పోస్ట్ అయ్యింది. హీరో అల్లు అర్జున్ పేరుతో పోస్ట్ చేయడంతో….అది సోషల్ మీడియాలో హల్చల్ సృష్టిస్తోంది. అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది?
అయితే సిటీలో సినీ, రాజకీయ ప్రముఖులు నివాసం ఉండే జూబ్లీహిల్స్ ప్రాంతంపై కొందరు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, అందుకు తమ హీరో పేరు దుర్వినియోగం చేస్తున్నారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో కరోనా బాధితుడు ఉంటే…ప్రభుత్వ దృష్టికి రాకపోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అల్లు అర్జున్ పేరుతో ఇచ్చిన ఈ పోస్టింగ్ ఉత్త ఫేక్ అని..ఎవరూ నమ్మవద్దని, ఆందోళన చెందొద్దని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.