నోరు జారితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయా? అనడానికి కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీఖాన్ ఉదాహ రణగా నిలిచాడు. త్రిషపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇటీవల ఎంత దుమారం రేపాయో తేలిసిందే. ఇప్పుడీ వివాదం ఏకంగా కోర్టులో పంచాయితీకి దారి తీసింది. పరుష పదజాలం అన్నది ఎంత ప్రమాదకర మైందో? ప్రత్యర్ధి సీరియస్ గా తీసుకుంటే తెలుస్తుంది. ఈ విషయంలో త్రిష సహా ఆమె మద్దతు వర్గమంతా ఏకమవ్వడంతో మన్సూర్ చుట్టూ ఉచ్చు బిగిసింది.
ఇదే అదునుగా భావించిన గాయని చిన్మయి సైతం సీన్ లోకి గతంతో సీనియర్ నటుడు రాధారవి చేసిన వ్యాఖ్యల్ని మరోసారి సోషల్ మీడియాలో షేర్ చేసి అప్పుడేమయ్యారు? ఈ మద్దతు దారులంతా అని తనదైన శైలిలో సెటైర్ వేసారు. నిజమే రాధారవి మైక్ ముందే బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ ని రేప్ చేసేవాడినని అనుచిత వ్యాఖ్యలు చేసారు. ఆ వీడియో పాతదే అయినా నెటి జనులకు ఆ సన్నివేశం కొత్తగా అనిపిస్తుంది. దీంతో రాధారవిపై నా నెటి జనులు దుమ్మెత్తిపోసారు. వీళ్లిద్దరే ఇలా నోరు జారలేదు.
కొన్నాళ్ల క్రితం తెలుగులో ఓ ఫేమస్ హీరో కూడా ఇలాగే మహిళల గురించి అసభ్యంగా మాట్లాడి విమర్శల పాలయ్యాడు. ఆయన ఏకంగా పబ్లిక్ మీటింగ్ లోనే..ప్రజా ప్రతినిధిగా ఉంటూనే ఆ వ్యాఖ్యలు చేసారు. ప్రతిగా అసెంబ్లీ లో సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇదే నటుడు అంతకు ముందు కొన్ని వేదిక లపైనా మహిళల్ని కించపరిచేలా మాట్లాడిన సందర్భాలున్నాయి. ఆ సమయంలో కొంత మంది మహిళలు అభ్యంతరం వ్యక్తం చేసినా..వ్యవహారం కామ్ అప్ అయింది.
మన్సూర్ అలీఖాన్ వివాదం నేపథ్యంలో ఆవ్యాఖ్యల్ని వ్యతిరేక వర్గం తవ్వి తీస్తుంది. అలాగే మరో సీనియర్ నటుడు కూడా కెమెరా ముందు హీరోయిన్లతో సరదాగా మూవ్ అవుతోన్న సన్నివేశాలు కూడా నెగిటివ్ గా వెళ్తున్నాయి. సోదర బావంతోనే సహ నటులతో అలా చనువుగా ఉన్నా! కళ్లన్నీ ఒకేలా చూడటానికి అవకాశం లేదు. సెలబ్రిటీ కల్చర్ లో సహజమే అనుకున్న సోసైటీలో అవి ప్రతిష్టను దిగజార్చేలా నే ఉంటాయన్నది గమనించాల్సి అంశం.