ట‌బు చ‌దువుకి అడుగ‌డుగునా అడ్డు త‌గిలిన స్టార్ మేక‌ర్!

సీనియ‌ర్ న‌టి ట‌బు సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌యాల‌కు వ‌య‌సుతో సంబంధం లేద‌ని హిట్ మీద హిట్ అందుకుంటుంది. ఇటీవ‌లే ‘ది క్రూ’తో భారీ విజ‌యం ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం లైన్ ప్ లోనూ కొన్ని సినిమాలున్నాయి. ఈ నేప‌థ్యంలో స్టార్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌పూర్ తో ఎదురైన ఓ అనుభ‌వం గురించి రివీల్ చేసింది. ఆయ‌న‌తో సినిమా ఎందుకు ఒప్పుకున్నాను? అని బాద‌ప‌డిన‌ట్లు గుర్తు చేసుకుంది.

ఆ సంగ‌తేంటో ఆమె మాట‌ల్లోనే..` ష‌బానా అజ్మీ నాకు బంధువు. ఓ సారి ఆమె ఇంటికెళ్లాను. అప్పుడే శేఖ‌ర్ క‌పూర్ న‌న్నుచూసారు. నాతో `దుష్మ‌ణి` సినిమా చేయాల‌నుకుంటున్న విష‌యం ఇంట్లో చెప్పారు. అప్పుడు నేను ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతున్నా. చ‌దువుపై ఆస‌క్తితో సినిమా చేయ‌న‌న్నా. కానీ ఆయ‌న చాలాసార్లు అడ‌గ‌డంతో ఒప్పుకున్నా. కానీ సిన‌మా ఏదో కార‌ణంతో ఆగిపోయింది. అదే సినిమాని స‌న్నిడియోల్, మ‌నీషా కోయిరాలాతో బంటి తెర‌కెక్కించాడు.

కొంత కాలం త‌ర్వాత మ‌ళ్లీ శేఖ‌ర్ కపూర్ క‌లిసి ప్రేమ్ సినిమాలోన‌టించ‌మ‌న్నారు. అప్పుడు ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాలు వెళ్తాను అని చెప్పాను. కానీ మ‌ళ్లీ అప్పుడుకూడా న‌టించాల్సిందేనని ప‌ట్టుబ‌ట్టారు. దీంతో మ‌ళ్లీ ఒప్పుకోక త‌ప్ప‌లేదు. ఈసారి షూటింగ్ కూడా మొద‌లైంది. కానీ మ‌ధ్య‌లోనే ఆయ‌న సినిమా నుంచి త‌ప్పుకున్నారు. ఆ త‌ర్వాత అదే సినిమా ఐదేళ్ల పాటు చేసారు. కానీ ఈసినిమా ఒప్పుకుని చాలా పెద్ద త‌ప్పుచేసాను అనిపించింది` అని తెలిపింది.

ఆ ర‌కంగా ట‌బు శేఖర్ క‌పూర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన రెండు అవ‌కాశాలు కోల్పోవ‌ల్సివ‌చ్చింది. అంతే కాదు శేఖ‌ర్ క‌పూర్ గ‌నుక అంత‌గా ఒత్తిడి తీసుకురాక‌పోయి ఉటే? ట‌బు అనే అందం సినిమాల్లోకి వ‌చ్చేది కాదేమో. ఉన్న‌త చ‌దువుల‌ని విదేశాల‌కు ఎగిరిపోయేది. కానీ శేఖ‌ర్ ఒత్తిడితోసినిమా అనే పునాది ఆమె హృద‌యంలో బ‌లంగా వేయ‌డంతో ముంబై బాలీవుడ్లో కొన‌సాగుతుంది. ఈ అమ్మ‌డు తెలుగు ఆడియ‌న్స్ కి ఎంతోసుప‌రిచితం అన్న సంగ‌తి తెలిసిందే. కానీ ట‌బు చ‌దువుకి మాత్రం అడుగ‌డుగునా శేఖ‌ర్ క‌పూర్ అడ్డు త‌గిలారు అన్న‌ది వాస్త‌వం.