రామ్ పోతినేని నుంచి ఆగష్టు 15న రాబోతున్న ప్యూర్ మాస్ బొమ్మ డబుల్ ఇస్మార్ట్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో హై ఎనర్జిటిక్ క్యారెక్టరైజేషన్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కింది. సంజయ్ దత్ ఈ సినిమాతో ప్రతినాయకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. సౌత్ లో ఇప్పటి వరకు సంజయ్ దత్ విలన్ గా చేసిన కేజీఎఫ్ చాప్టర్ 2, లియో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్ కూడా పక్కా హిట్ అని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కి మాస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి మెంటల్ మాస్ కథలకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని పూరి టీమ్ విశ్వసిస్తోంది. మూవీ షూటింగ్ సమయంలో నేను ఎంజాయ్ చేసిన దాంట్లో 10 శాతం ఆడియన్స్ ఆశ్వాదించిన డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని రామ్ పోతినేని చెబుతున్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే డబుల్ ఇస్మార్ట్ సినిమాకి వరల్డ్ వైడ్ గా సాలిడ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో డబుల్ ఇస్మార్ట్ థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ మూవీ బిజినెస్ డీటెయిల్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. నైజాంలో 15.50 కోట్ల వేల్యూతో రిలీజ్ అవుతోంది. సీడెడ్ లో 6 కోట్ల బిజినెస్ జరిగింది. ఆంధ్రాలో 17.50 కోట్లకి రైట్స్ అమ్ముడయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల మొత్తం 39 కోట్ల లెక్క కనిపిస్తోంది.
హిందీ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 6 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో డబుల్ ఇస్మార్ట్ రైట్స్ 3 కోట్లకి అమ్ముడయ్యాయి. ఓవరాల్ గా 48 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ డబుల్ ఇస్మార్ట్ పైన వరల్డ్ వైడ్ గా జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 49 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే ఈ బ్రేక్ టార్గెట్ కష్టమేమీ కాదు.
ఇస్మార్ట్ శంకర్ మూవీ 20 కోట్ల బిజినెస్ టార్గెట్ తో 2019లో ప్రేక్షకుల ముందుకి రాగా వరల్డ్ వైడ్ గా 40.5 కోట్ల షేర్ అందుకుంది. రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ ఉంది. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ తో ఆ రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్ రామ్ కి లభించింది. అలాగే 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో డబుల్ ఇస్మార్ట్ తో చేసే అవకాశం కూడా ఉంది.
కాకపోతే ఈ కలెక్షన్స్, భారీ సక్సెస్ అనేది కంప్లీట్ గా మూవీ కంటెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. రామ్ పోతినేని రెగ్యులర్ మార్కెట్ కి మించి ఈ సినిమాపై బిజినెస్ జరిగిందని, అందుకే కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే భారీ టార్గెట్ ని ఛేజ్ చేసే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు.