తండ్రి సినిమాలో కొడుకు స్పెషల్ రోల్

సీనియర్ హీరో మోహన్ బాబు చాన్నాళ్ల తరువాత మళ్లీ స్క్రీన్ మీదకు వస్తున్నారు. ఆయనే హీరోగా, ఆయనే విలన్ గా ఓ విలక్షణమైన సినిమా చేస్తున్నారు. ఇదే సినిమాలో మోహన్ బాబు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సందర్భంగా హీరో మంచు విష్ణు కూడా నటిస్తున్నట్లు తెలిసింది. మంచు విష్ణు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో పది నిమషాలు కనిపిస్తాడు.

ఈ స్పెషల్ రోల్ చాలా ప్రత్యేకంగా వుంటుందని, అందుకే విష్ణు చేయాలని అనుకున్నారని తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం అల్లరి నరేష్ నటించిన మేడ మీద అబ్బాయి సినిమాలో హీరోయిన్ గా నటించిన నిఖిల విమల్ ఈ సినిమాలో మోహన్ బాబు కుమార్తెగా నటిస్తోంది. కథ ఆమె చుట్టూనే తిరుగుతుందని వినికిడి.

ప్రస్తుతం విష్ణు చేస్తున్న ఆచారి అమెరికా యాత్ర సినిమా చాలా వరకు పూర్తయింది. మరో సినిమా సెట్ మీదకు వెళ్లడానికి రెడీ అవుతోంది. ఆచారి అమెరికా యాత్రలో చాలాకాలం తరువాత స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఓ ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నారు