కావల్సినంత అందం ఉన్నా, అదృష్టం లేక బిజీ హీరోయిన్ కాలేకపోతోంది మెహ్రీన్. ‘ఎఫ్ 2’ లాంటి మంచి హిట్టు పడిందని సంతోషించేలోపు ‘చాణిక్య’, ‘ఎంత మంచివాడవురా’ సినిమాలతో డబుల్ ఫ్లాపులు వచ్చాయి. నాగశౌర్య ‘అశ్వర్థామ’ సినిమా తర్వాత బాగా ఖాళీగా ఉన్న ఢిల్లీ గాళ్ మెహ్రీన్‌కు మంచి ఆఫర్ దక్కిందని టాక్.
బీటౌన్‌లో ఇప్పుడు వెబ్ సిరీస్‌లకు మంచి గిరాకీ ఉంది. బోల్డ్ సీన్స్‌లో నటించేందుకు హీరోయిన్లు ఆసక్తి చూపించడంతో వెబ్ సిరీస్‌లకు భలే గిరాకీ ఏర్పడింది. మెహ్రీన్ తమ్ముడు గుర్ఫతే సింగ్ ఫిర్జాదా బాలీవుడ్లో ‘గిల్టీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ పాపులారిటీతోనే గుర్ఫతే, తన అక్కకు ఓ వెబ్ సిరీస్‌లో అవకాశం ఇప్పించినట్టు టాక్.
‘నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే ఈ వెబ్ సిరీస్‌లో మెహ్రీన్ ఎలా కనిపిస్తుందో, ఎంతలా బీటౌన్ జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే మెహ్రీన్‌కు బాలీవుడ్ కొత్తేమీ కాదు. అనుష్క శర్మ నిర్మించిన ‘పిల్హౌరీ’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది మెహ్రీన్. అది బాక్సాఫీస్ దగ్గర యావరేజ్‌గా సరిపెట్టుకోవడంతో హానీ పాపను ఎవ్వరూ పట్టించుకోలేదు.
తమ్ముడి సాయంతో బాలీవుడ్లో పాగా వేయాలని చూస్తున్న మెహ్రీన్ ప్లాన్స్ వర్కవుట్ కావడం అంత తేలికేం కాదు. ఎందుకంటే తెలుగులో ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ ‘మహానుభావుడు’,‘రాజా ది గ్రేట్’ సినిమాలతో కెరీర్ మొదట్లో మంచి హిట్స్ అందుకుంది. అయితే ఆ తర్వాత షేప్ అవుట్ అయిపోయి బొద్దుగుమ్మలా మారిపోయింది.
ఇక మెహ్రీన్ పనైపోయిందనుకుంటున్న సమయంలో స్లిమ్ లుక్‌లోకి మారిపోయి, మళ్లీ ఛాన్స్‌లు కొట్టేసింది. అయినా బ్యాడ్ లక్ మాత్రం వదలడం లేదు. ఒక్క హిట్టు వస్తే రెండు ఫ్లాపులు ఆ విజయాన్ని మరిచిపోయేలా చేస్తున్నాయి. మరి ఈ వెబ్ సిరీస్‌తోనైనా మెహ్రీన్ బ్యాడ్ లక్ దూరం అవుతుందేమో చూడాలి.