తారక్, చరణ్ కాదు… ప్రభాస్ ఇష్టం!

ఆర్.ఆర్.ఆర్.లో రామ్ చరణ్ సరసన నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కి తెలుగు హీరోల్లో ఎవరు ఇష్టం అని అడిగితే తన తొలి తెలుగు సినిమా హీరోల పేర్లు చెప్పలేదు. తనకి ప్రభాస్ అంటే ఇష్టమని, బాహుబలి చూసి ప్రభాస్ ఫ్యాన్ అయ్యానని ఆలియా చెప్పింది.

ప్రభాస్ స్క్రీన్ ప్రెజన్స్ తనకి బాగా ఇష్టమట. బహుశా ప్రభాస్ అడిగితే అతనితో ఒక సినిమా చేస్తుందేమో కూడా. బాహుబలి చిత్రమంటే ఆలియాకి నిజంగానే చాలా ఇష్టం. ఆ చిత్ర దర్శకుడు రాజమౌళితో పని చేయాలని ఆమె నిర్ణయించుకుంది. అందుకే ఆయన అడగగానే ఆర్.ఆర్.ఆర్ లో నటించడానికి అంగీకరించింది.

డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అవుతున్నా కానీ ఈ సినిమాని పోగొట్టుకోవడానికి ఆమె సిద్ధంగా లేదు. అందుకే రాజమౌళికి మరోసారి భరోసా ఇచ్చింది. కరోనా వల్ల షూటింగ్ డిలే అయినా కానీ తాను ముందుగా ఈ చిత్రం పూర్తి చేశాకే వేరే సినిమాలకి డేట్స్ ఇస్తానని మాట ఇచ్చింది.