వెండి తెరపై సూర్య సాహసాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల నటుడు. సూర్య ప్రవేశంతో ఆ పాత్రకే వన్నె తేగల గ్రేట్ పెర్పార్మర్. కళ్లతోనే గొప్ప హవభావాలు పలికించగల ఏకైకా ఇండియన్ స్టార్. తాజాగా 43వ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. సుధ కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇంతవరకూ ఎలాంటి కంటెంట్ తో రాబోతుంది? అన్నది రివీల్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇద్దరు సంచలన అంశాన్నే టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
1967లో తమిళనాడులో చెలరేగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందు లో సూర్య కాలేజీ విద్యార్ధి నాయకుడి పాత్రలో నటించనున్నాడు. ఈ పాత్ర కోసం సూర్య ప్రత్యేకంగా సన్న ధం కానున్నాడుట. ఇలాంటి పాత్రల్లో సూర్య ఎలా ఒదిగిపోతాడో చెప్పాల్సిన పనిలేదు. ‘యువ’ చిత్రంలోనూ విద్యార్ధి నాయకుడి పాత్రను ఎంత గొప్పగా పోషించాడో తెలిసిందే.
మళ్లీ అలాంటి రోల్ పోషించే ఛాన్స్ సూర్యకి దక్కింది. అయితే ఈసారి వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా కాబట్టి ఆ పాత్ర ఇంకా బలంగా పండటానికి అవకాశం ఉంటుంది. బయోపిక్ లు తెరకెక్కించడంలో సుధ కొగర స్పెషలిస్ట్ అని చెప్పాల్సిన పనిలేదు. గతంలో బాక్సింగ్ నేపథ్యంలో వెంకటేష్ తో ‘గురు’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో ఎమోషన్ ఎంతో గొప్పగా సాగింది.
అటుపై సూర్య తో ‘ఆకాశం నీ హద్దురా’ అనే ఎయిర్ పోర్స్ నేపథ్యంలో ఓ సినిమా చేసారు. అది పెద్ద విజయం సాధించింది. ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా వరించింది.ఇప్పుడు ఏకంగా సెన్సిటివ్ అంశాన్నే టచ్ చేస్తున్నారు తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రం వేరు అయిన సందర్భంలో ఎలాంటి అల్లర్లు చోటు చేసుకున్నాయో తెలిసిందే. హిందీ వ్యతిరేకోద్యమంలో అప్పట్లోనూ అలాంటి సంచలన సంఘటనలెన్నో ఉన్నాయి. వాటన్నింటినీ మళ్లీ సుధ కొంగర తట్టి లేపుతున్నట్లే కనిపిస్తోంది.