‘దంగ‌ల్’ బ్యూటీ ఓల్డ్ గోల్డ్ లా మారిపోయిందే!

‘దంగ‌ల్’ తో ఫేమ‌స్ అయిన ఫాతిమా స‌నాషేక్ సుప‌రిచిత‌మే. అమ్మ‌డు అథ్లెట్ పాత్ర‌లో అద‌ర‌గొట్టిన వైనం ఇంట్రెస్టింగ్. అంత‌కు ముందు ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు దంగల్ తెచ్చిపెట్టింది. అప్ప‌టి నుంచి అమ్మ‌డి స్టార్ కూడా మారిపోయింది. వ‌రుస‌గా స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషించింది. థ‌గ్స్ ఆఫ్ హిందుస్తాన్.. లూడో…థార్..సామ్ బ‌హదూర్ లాంటి చిత్రాల్లో న‌టించింది.

భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన ఆ సినిమాలేవి కూడా వాటిని అందుకోడంలో విఫ‌ల‌మ‌య్యాయి. ఆ ర‌కంగా ఫామితా శ్ర‌మంతా వృద్ధా ప్ర‌య‌త్నంగానే మిగిలిపోయింది. దీంతో కెరీర్ పైనా కొంత ప్ర‌భావం చూపించింది. ఈ నేప‌థ్యంలో వెబ్ సిరీస్ ల‌కు ఒకే చెప్పింది. గ్యాప్ లేకుండా ప్రేక్ష‌కుల‌కు ట‌చ్ లో ఉండేలా చూసుకుంటుంది. ఇదే క్ర‌మంలో అమ్మ‌డు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. బాలీవుడ్ భామ‌ల‌కు ధీటైన హాట్ ఫోట‌ల‌తో అప్పుడ‌ప్పుడు ప్ర‌కంప‌క‌ల‌ను సృష్టిస్తుంది.

త‌న‌దైన అంద చందాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. తాజాగా ఫాతిమా ఓల్డ్ క్లాస్ హీరోయిన్ ఆహార్యంలోకి దూరిపోయింది. ఇదిగో ఇక్క‌డిలా…60-70 కాలంలో మోడ్ర‌న్ హీరోయిన్ దుస్తుల్లో..మ్యాక‌ప్ లో త‌ళుకులీనింది. బ్లాక్ స్క‌ర్ట్…ఎరుపు రంగు అప్ప‌టి మోడ్ర‌న్ డిజైన్ లో కొత్త‌గా ప్ర‌జెంట్ చేసుకుంది. ఇక అమ్మ‌డి హెయిర్ స్టైల్ మాత్రం ఆ నాటి మ‌ణుల్ని త‌ల‌పిస్తుంది. మొడ భాగంలో త‌ల రింగులు… చేతిలో స్టైలిష్ గా సిగ‌రెట్టు.. టేబుల్ పై గోల్డ్ క‌ల‌ర్ హ్యాండ్ బ్యాగ్ అచ్చంగా ఆ నాటి క్లాసిక్ హీరోయిన్ ని త‌ల‌పిస్తుంది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. అమ్మ‌డి ఫాలోవ‌ర్లు తొలుత ఎవ‌రీ ఓల్డ్ హీరోయిన్ అనుకున్నా! ద‌గ్గ‌ర‌గా ప‌రిశిలిస్తే నేటి న‌టిమ‌ణి..నాటి హీరోయిన్ లా ముస్తాబైంది అన్న‌ది అర్ధ‌మ‌వుతుంది. ఈ డిఫ‌రెంట్ లుక్ ని ప్ర‌శంసించాల్సిందే. అంద‌రి హీరోయిన్ లా కాకుండా కొత్త‌గా ప్ర‌య‌త్నించి యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకుంటుంది.