దిల్ రాజు బ్యానర్ లో రామ్

Actor Ram Pothineni @ Nenu Sailaja Movie Success Meet Stills

టాప్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు ఎవర్నీ వదలడం లేదు దిల్ రాజు. ఏడాదికి కనీసం అరడజను సినిమాలు తీయడమే టార్గెట్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆ విధంగా ఆయన థియేటర్లకు చాలా వరకు పని కల్పించినట్లూ అవుతుంది. మంచి సినిమాలు అందించి, మంచి వ్యాపారం చేసుకున్నట్లు అవుతుంది.

నానితో సినిమా సెట్ మీద వుంది. రాజ్ తరుణ్ సినిమాకు కొబ్బరికాయ కోట్టారు. నిఖిల్ తో సినిమా ప్లానింగ్ లో వుంది. ఇప్పుడు రామ్ తో కూడా సినిమా ఫిక్స్ ఛేసుకున్నారు దిల్ రాజు. సినిమా చూపిస్త మావా, నేను లోకల్ వంటి సినిమా లు అందించిన నక్కిన త్రినాధరావు డైరక్షన్ లో హీరో రామ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

వరుసగా రెండు క్లాస్ సినిమాలు చేసిన రామ్ కు, నక్కిన త్రినాధరావు స్టయిల్ మాస్ సినిమా అంటే కాస్త ఛేంజ్ ఓవర్ గానే వుంటుంది. పైగా దిల్ రాజు బ్యానర్ కాబట్టి కథ, తదితర విషయాల్లో కాస్త జాగ్రత్త వుంటుంది.