దీపిక సైతం మామ్ ల‌వ్ లో మునిగి తేలుతోందా!

దీపికా ప‌దుకొణే గ‌ర్భం దాల్చ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన సంగ‌తి తెలిసిందే. ముఖ్య‌మైన ప‌నులుంటే బ‌య‌ట‌కు వ‌స్తుంది? లేదంటే ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తోనే స‌మ‌యాన్ని గ‌డుపుతుంది. కానీ భ‌ర్త ర‌ణ‌వీర్ సింగ్ తో మాత్రం ప్ర‌తీమూవ్ మెంట్ ని ఎంతో ఆస్వాదిస్తుంది. ఎన్నిక‌ల రోజు ముంబైలో ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం కోసం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత ముంబై రెస్టారెంట్ ల్లోనూ ప‌లుమార్లు ద‌ర్శ‌న‌మిచ్చారు.

ఇంట్లో బోర్ కొట్టి బ‌య‌ట‌కు వెళ్లాల‌నిపించిన‌ప్పుడ‌ల్లా త‌ప్ప‌కుండా కేవ‌లం ర‌ణ‌వీర్ మాత్ర‌మే ఉంటే వెళ్తుంది. బేబి బంప్ ఫోటోలు కూడా పెద్ద‌గా రివీల్ చేయ‌డం లేదు .ఆ మ‌ధ్య గ‌నులో కొన్ని ఫోటోలు వ‌దిలింది. కానీ ఆ త‌ర్వాత మ‌ళ్లీ వాటికి దూర‌మైంది. ఇక ఇంట్లో దీపిక ఇష్ట‌మైన రుచుల‌న్నింటిని కూడా ఆస్వాదిస్తుందిట‌. గ‌ర్బిణీ కావ‌డంతో తినాల‌నిపిచిన ఏ ఐట‌మ్ అయినా అంతా హోమ్ మేడ్ అట‌.

బ‌య‌ట ప‌దార్దాలు త‌క్కువ‌గా తీసుకుంటుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం త‌ల్లిదండ్రులు కూడా దీపిక‌తోనే ఉండ‌టంతో దీపిక మామ్ కావాల్సిన వాట‌న్నింటిని స్వ‌యంగా వండి పెడుతుందిట‌. అప్పుడ‌ప్పుడు ర‌ణ‌వీర్ త‌ల్లిదండ్రులు కూడా వ‌చ్చి చూసివెళ్తున్నారుట‌. అలా దీపిక పూర్తిగా కుటుంబ అనుంబంధాల‌కే బాండ్ అయింది. ఇలాంటి స‌మ‌యంలో ప్రేమ‌, ఆప్యాయ‌త‌ల అవ‌స‌రం ఎంతో అవ‌స‌రం.

పుట్ట‌బోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఆదోళ‌న‌ల‌కు గురికాకుడ‌దు. ఆ ఛాన్సే ఇవ్వ‌కుండా ర‌ణ‌వీర్ అండ్ కో ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. సెప్టెంబ‌ర్ లో ప్ర‌స‌వం జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం అందుతోంది. త్వ‌ర‌లోనే దీపిక న‌టించిన `క‌ల్కి 2898` కూడా రిలీజ్ అవుతంది. ఈ సినిమా ప్ర‌చారంలో దీపిక పాల్గొనే అవ‌కాశం లేదు. సినిమాకి సంబంధించి తాను చెప్పాద‌లుచుకున్న ది ఏదైనా వీడియో షూట్ చేసి సోష‌ల్ మీడియాలో వ‌దిలే అవ‌కాశం ఉంది.