పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో ప్రారంభమైన మూవీ ఓజీ. ఈ సినిమా పూజా కార్యక్రమాలు తాజాగా జరిగాయి. ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. వీలైనంత తక్కువ టైమ్ లో సుజిత్ ఈ సినిమా కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నారు.
ఇక భారీ బడ్జెట్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతుంది. పవన్ కళ్యాణ్ నుంచి వచ్చే రెగ్యులర్ కమర్షియల్ మూవీలా కాకుండా కాస్తా కొత్తగా ఈ మూవీ కాన్సెప్ట్ ఉంటుందనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం కొన్ని గాసిప్స్ టాలీవుడ్ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ కీలక పాత్రల కోసం సీనియర్ కథానాయికలని సుజిత్ లైన్ లోకి తీసుకున్నాడని టాక్. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ అత్తగా నటించిన నదియాని లేదంటే సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
దాంతో పాటు హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన టబుని కూడా సంప్రదిస్తున్నట్లుగా సమాచారం. అయితే ప్రస్తుతం నగ్మ సినిమాలు ఏమీ చేయడం లేదు.
రాజకీయాలలో ఉంది. ఈ నేపధ్యంలో ఆమెని మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమా కోసం తీసుకొస్తే అది కూడా ఎంతో కొంత మూవీపై క్యూరియాసిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు. అలాగే టబుకి ఇటు తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి ఇమేజ్ ఉంది. ఈ నేపధ్యంలో పాన్ ఇండియా లెవల్ లో మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటే కచ్చితంగా ఆమె ప్లస్ అవుతుంది.
ఇలా అన్ని రకాలుగా ఆలోచించుకొని టబు నగ్మలో ఒకరిని ఫైనల్ చేయాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర ఉండదనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ ఉన్నాకూడా కథలో భాగంగా ఉండొచ్చని భావిస్తున్నారు. మరి ఆ పాత్ర కోసం ఎవరిని ఎంపిక చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక కీ రోల్ లో టబు నగ్మ కాకుంటే మూడో ఆప్షన్ గా నదియా పేరు వినిపిస్తుంది.