నాటకంగా ఆర్‌ఆర్‌ఆర్‌… అరుదైన గౌరవం

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఆర్ఆర్‌ సినిమా విడుదల అయ్యి రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కూడా రికార్డుల పరంపర కొనసాగడం, అరుదైన గౌరవాలు దక్కడం జరుగుతుంది. జపాన్ లో ఈ సినిమా 500 రోజులకు పైగా ప్రదర్శింపబడి అరుదైన రికార్డు ను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

ఇటీవల రాజమౌళితో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు ఆయన కుటుంబ సభ్యులు జపాన్ కు వెళ్లారు. అక్కడ ప్రేక్షకులతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాను చూడటం జరిగింది. అద్భుతమైన స్వాగతం రాజమౌళి టీం కి అక్కడ దక్కింది. అంతే కాకుండా ఆర్ఆర్ఆర్ ను అక్కడి ప్రేక్షకులు ఓన్‌ చేసుకున్నారు.

తాజాగా రాజమౌళి ట్విట్టర్‌ లో ఆసక్తికర విషయాన్ని షేర్ చేశారు. 110 ఏండ్ల చరిత్ర ఉన్న తకరాజుకా అనే జపాన్ నాటక సంస్థ ఆర్‌ఆర్ఆర్ సినిమాను నాటకంగా తీర్చిదిద్దడం మాకు గర్వంగా ఉంది. జపాన్ ప్రేక్షకులు మా సినిమాను నాటకంగా స్వీకరించిందుకు కృతజ్ఞతలు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పట్ల మీ ప్రేమ మరియు మీ స్పందన చూస్తే గర్వంగా ఉంది. ఈ నాటకంను ప్రదర్శించిన అమ్మాయిల ఉత్సాహం మరియు వారి యొక్క ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే అంటూ కొన్ని వీడియోలను రాజమౌళి తన ఎక్స్ లో షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు, జక్కన్న ట్వీట్ వైరల్‌ అవుతున్నాయి.