నా కూతురు పెళ్లి గురించి తెలియదు..!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా పెళ్లి వార్తలు జాతీయ మీడియాలో గత వారం రోజులుగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈనెల 23న జహీర్ ఇక్బాల్ ను సోనాక్షి పెళ్లి చేసుకోబోతుంది అంటూ వస్తున్న వార్తలు దాదాపుగా కన్ఫర్మ్‌ అన్నట్టుగా ఆమె సన్నిహితులు మాట్లాడుతున్నారు.

ఈ సమయంలో సోనాక్షి సిన్హా తండ్రి, సీనియర్‌ స్టార్‌ అయిన శత్రుఘ్న సిన్హా మాత్రం తన కూతురు వివాహం గురించి ఇంకా నాకు తెలియదు అన్నాడు. జాతీయ మీడియాలో వస్తున్న వార్తలపై నేను స్పందించలేను అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

సోనాక్షి తన పెళ్లి విషయాన్ని, ప్రేమ విషయాన్ని కుటుంబంలో ఇంకా చర్చించలేదు. అయితే ఆమె ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తప్పకుండా మా అందరి మద్దతు ఉంటుంది. సోనాక్షి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా చాలా సార్లు ఆలోచించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటుంది. కనుక పెళ్లి విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

పెళ్లి విషయంలో సోనాక్షి తీసుకునే నిర్ణయాన్ని నేను మరియు నా భార్య ఆశీర్వదిస్తామని శత్రఘ్న సిన్హా అన్నారు. అయితే ఇప్పటి వరకు మీకు తెలియక పోవడం ఏంటి అంటూ మీడియా వారు ఆయనను ప్రశ్నించగా అందుకు ఆయన సమాధానం చెప్పలేదు.

బాలీవుడ్‌ లో ఇటీవల సోనాక్షి సిన్హా హీరామండి సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. మళ్లీ హీరోయిన్ గా సోనాక్షి సిన్హా బిజీ అవ్వబోతుంది అనుకుంటున్న సమయంలో ఇలా అనూహ్యంగా పెళ్లి ప్రకటన చేయడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆమె ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.